Manish Sisodiya: దిల్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా మళ్లీ తిరిగి వస్తారా?
సుప్రీంకోర్టులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, అప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ పై తీర్పు వెలువడింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. ఎక్సైంజ్ కేసులో 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఫిబ్రవరి 26, 2023న సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది. ఈ క్రమంలో కొద్ది రోజులకే ఆయన తన డిప్యూటీ సీఎం పదవికి, దిల్లీ క్యాబినేట్‌కు రాజీనామా చేశారు.
మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు
ఆయన మళ్లీ ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎలాంటి మంత్రి పదవిని స్వీకరించలేరు. అతను రాబోయే కాలంలో కేవలం ఎమ్మెల్యేగానే మిగిలిపోతాడని నివేదికలు చెబుతున్నాయి. 2022 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిబిఐ దాఖలు చేసిన మొదటి ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియాను మొదటి నిందితుడిగా చేర్చారు. అయితే సీబీఐ రెండు వారాల తరువాత అతన్ని అరెస్టు చేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఒకవేళ సిసోడియాను డిప్యూటీ సీఎంగా నియమించాలంటే, ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి పంపితే దానిని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్-జి) ఆమోదించాలి.