Page Loader
Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు
వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు

Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో స్థాపించిన తెలుగుతల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు మాట్లాడుతూ, "తెలంగాణకి చెడ్డ పేరును తెచ్చేలా అందాల పోటీలు నిర్వహించారు. వాటిపై రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు. మిస్ ఇంగ్లాండ్ కూడా వాటిపై అనుచిత ఆరోపణలు చేశారు. ఈ పోటీలు విందులకు, వినోదాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

Details

తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అన్యాయం

మూసీ పునరుద్ధరణ, హైడ్రా వంటి ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అలాగే, రాజీవ్ యువశక్తి పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి చేకూరుతోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం దారుణమని అభిప్రాయపడ్డారు. "కేసీఆర్ సాధించిన అభివృద్ధిని తొలగించాలన్నది రేవంత్‌రెడ్డి సంకల్పమా? రైతుబంధు, కల్యాణ లక్ష్మి, జిల్లాకో మెడికల్ కాలేజీ.. ఇవన్నీ రద్దు చేస్తారా? అద్భుతంగా నిర్మించిన సచివాలయం కూల్చేస్తారా? 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కూడా తొలగించాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. దేవుడి మీద ఒట్టు వేసి మాట తప్పిన వ్యక్తి రేవంత్‌రెడ్డి ఎలా సీఎం అయ్యారని హరీశ్ రావు నిలదీశారు.