తదుపరి వార్తా కథనం

AP Rains: తూర్పు తీర రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 21, 2024
10:55 am
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం, మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది.
బుధవారానికి తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపైన ఈ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.
భువనేశ్వర్ లేదా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది.
Details
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
అయితే, తుపాను ప్రభావం రాష్ట్రంపై ఎంత మేరకు ఉంటుందనే విషయంలో అంచనాలు మాత్రం ఇప్పటికీ చెప్పలేమని వాతావరణ నిపుణులు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో గురువారం నుండి శనివారం వరకు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఆదేశాలను జారీ చేశారు.