తదుపరి వార్తా కథనం
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సపోర్టుతో గెలిచా.. బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 23, 2024
05:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది.
మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 229 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచిన మహాయుతి, 220 సిట్లతో మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. ఈ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ కీలకంగా పాల్గొన్నారు.
ఆయన బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాలలోని సోలాపూర్ సిటీ సెంట్రల్‌లో బీజేపీ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ ఘన విజయం సాధించారు.
Details
పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు
ఈ విజయం తరువాత దేవేంద్ర మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు అని తెలిపారు.
ఈ విజయం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైందని, ఆయనకి తాను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు. రెండు గంటలు చేసిన రోడ్ షోకు భారీ జనాలు వచ్చి మద్దతు ఇచ్చారన్నారు.
మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను ప్రభావితం చేశారని దేవేంద్ర చెప్పారు.