
ఆ హామీలతో ఎన్నికలో బరిలోకి బీజేపీ.. మోదీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
ఈ వార్తాకథనం ఏంటి
2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం పాలైన బీజేపీ ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కసరత్తులను ప్రారంభించింది.
ప్రజలకు భారంగా ఉన్న ఎల్‌పీజీ ధరలను తగ్గించడం కేంద్రం మరో ముందుడగు వేయనుంది. సిలిండర్లు ధర రూ.1,100 కంటే ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు అగ్రహంగా ఉన్నారు.
కర్ణాటక వంటి రాష్ట్రాల ఎన్నికలలో కూడా బీజేపీ కూటమికి సిలిండర్ల ధరలు ఒకరకంగా దెబ్బతీశానే చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ల ధరను తగ్గించడం, PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద చెల్లింపులను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
Details
హార్ ఘర్ జల్ పథకం ప్రతి ఇంటికీ కుళాయి నీటి కనెక్షన్లు
రాజస్థాన్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎల్‌పిజి సిలిండర్ ను రూ. 500 కు అందిస్తోంది.
మిగిలిన ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్‌పిజి సిలిండర్ ను రూ.500 కే ఇస్తామని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ హామీ ఇచ్చారు. దీంతో సిలిండర్ల ధరపై కేంద్రం ఫోకస్ చేసింది.
అదేవిధంగా 'హార్ ఘర్ జల్' పథకం ద్వారా దేశమంతటా ప్రతి ఇంటికి కుళాయి నీటి కనెక్షన్లు అందజేయాలని కేంద్రం భావిస్తోంది.
నాలుగేళ్ల క్రితం జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పుడు 67 శాతం కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌లు అందించింది. ప్రస్తుతం 100 శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Details
పీఎం కిసాన్ నగదును పెంచడానికి ప్రణాళికలు
పీఎం కిసాన్ కింద రైతులు చెల్లింపులు పెంచాలని చూస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద ఒక్కో రైతులు రూ.2000 చొప్పున మూడు వాయిదాలతో సంవత్సరానికి 6వేలు ఇస్తోంది.
గత నాలుగు సంవత్సరాల నుండి ధరల విషయంలో ఎలాంటి మార్పు రాలేదు.
నకిలీ లబ్ధిదారులను తొలగించడానికి ఆధార్, బ్యాంకు ఖాతాల ఆధారంగా ఈ పథకం కింద డబ్బు పొందుతున్న రైతుల సంఖ్యను గత నాలుగు సంవత్సరాల్లో సూమారు 11 కోట్ల నుండి 8.8 కోట్లకు పడిపోవడం విశేషం.