BJP, CPM slam: పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళపై విచక్షణా రహితంగా దాడి.. నిందితుడి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళను వీధిలో కనికరం లేకుండా కొట్టినట్లు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.
దీనిపై అక్కడి ప్రతిపక్షాలు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)పై విమర్శలు గుప్పించాయి.
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా చోప్రా ప్రాంతంలో మహిళను టీఎంసీ కార్యకర్త కొట్టాడని ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ, సీపీఐ(ఎం) ఆరోపించాయి.
వివరాలు
చోద్యం చూసినట్లు చూశారు
చుట్టుపక్కల ప్రజలు మూగ ప్రేక్షకులుగా నిలబడి చోద్యం చూసినట్లు చూశారు. ఒక వ్యక్తి ఒక మహిళను పట్టుకోగా , మరో వ్యక్తిని వెదురు కర్రలతో కొట్టడం వీడియోలో కనిపించింది.
ఆ పురుషుడు ఆ స్త్రీని తల వెంట్రుకలతో పక్కకు లాగి చితక బాదాడు. దాడి కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీడియో వైరల్ కావడంతో తజ్ముల్ హక్ అలియాస్ జేసీబీ పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
వివరాలు
ప్రధాన నిందితుడుపై కేసు నమోదు
ప్రధాన నిందితుడు తజ్ముల్ హక్ అలియాస్ జెసిబిపై ఐపిసి సెక్షన్ 354,341,325,506 , 34 కింద కేసు నమోదు చేశారు.
దాడికి పాల్పడిన వ్యక్తిని ఈ రోజు ఇస్లాంపూర్ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఇస్లాంపూర్ పోలీసు జిల్లా ఎస్పీ డాక్టర్ జాబీ థామస్ ఆదివారం తెలిపారు.
ఆదివారం ఉదయం నుండి ఒక వీడియో (దాడి) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాము గమనించి చోప్రా పోలీస్ స్టేషన్‌లో సుమోటో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
సత్వర చర్య తీసుకున్నామన్నారు. వీడియోలో కనిపించిన వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితుడిని వెంటనే గుర్తించారు.
ఆ జంటను కొట్టడంపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.