Yogi Adityanath: సీఎం యోగిని చంపేస్తామని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరించిన ఓ మహిళను పోలీసులు, సార్వత్రిక ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రకారం, ఆమె మానసికంగా బలహీనురాలు. ఈ మహిళ యోగిని 10 రోజుల్లో రాజీనామా చేయకుంటే బాబా సిద్ధిఖీలా చంపుతామని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై యూపీ సీఎం యోగికి బెదిరింపు సందేశం రావడంతో మహారాష్ట్ర ఏటీఎస్, థానే పోలీసులు, ముంబైలోని వర్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఆమెను ఇంటి వద్దే విచారణ
ఈమహిళ పేరు ఫాతిమా ఖాన్.ఆమె థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్‌లో నివాసం ఉంటోంది. సంయుక్త విచారణలో ఆమె మానసిక స్థితి గురించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి. యోగికి బెదిరింపు సందేశం అందిన వెంటనే,ఏటీఎస్‌కు సమాచారం అందింది.ఏటీఎస్ చాలా మంది మహిళలను విచారించింది, చివరికి ఆమె జాడను కనుగొన్న ఏటీఎస్ పోలీసులు ఆమెను ఇంటి వద్ద విచారించిన తరువాత,స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ కూడా విచారణ జరిపారు. వారి విచారణ అనంతరం వర్లీ పోలీసులకు సమాచారం అందించారు.అయితే ఆ సమయంలో మహిళను అరెస్టు చేయలేదు. ముంబయికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఈవిషయం ధృవీకరించారు.ఇప్పటికే,ఫాతిమా ఖాన్‌కు నోటీసులు జారీ చేశారు. ఆమె మానసిక ఆరోగ్యం గురించి తెలియచేయడానికి మెడికల్ చెకప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది.