Loading...
Bhubaneswar: ఇండిగో విమానం రద్దు.. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి మహిళ హల్‌చల్‌ .. వీడియో వైరల్
ఇండిగో విమానం రద్దు.. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి మహిళ హల్‌చల్‌ .. వీడియో వైరల్

Bhubaneswar: ఇండిగో విమానం రద్దు.. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి మహిళ హల్‌చల్‌ .. వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
11:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో విమానం రద్దవడంతో ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.. షెడ్యూల్ ప్రకారం గురువారం మధ్యాహ్నం 2:35 గంటలకు ఇండిగో విమానం భువనేశ్వర్ నుంచి దిల్లీ బయల్దేరాల్సి ఉంది. ఇందుకోసం ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకుని గంటల తరబడి ఎదురుచూశారు. అయితే విమానం పరిస్థితిపై ఎయిర్‌లైన్స్‌ నుంచి వారికి సరైన సమాచారం అందలేదు. చివరకు సాయంత్రం 5:30 గంటల సమయంలో ఆ విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు.

వివరాలు 

విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మహిళ

విమానం రద్దు చేసిన తర్వాత కూడా ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఓ మహిళ తీవ్ర అసహనానికి గురయ్యారు.

తన ప్రయాణం అత్యవసరమని, అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ దగ్గరకు వెళ్లాల్సి ఉందని సిబ్బందికి తెలిపారు.

తనకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయాలని పట్టుబట్టారు.

ఈ క్రమంలో ఆమె లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి అక్కడ ఉన్న విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

సిబ్బంది వద్ద ఉన్న ఫైళ్లను కూడా ఆమె విసిరికొట్టినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడున్నవారు ఈ ఘటనను వీడియో తీశారు.

వివరాలు 

మహిళతో మాట్లాడిన CISF సిబ్బంది

తర్వాత CISF సిబ్బంది అక్కడికి చేరుకుని మహిళను సముదాయించారు. ఆమెతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

అనంతరం మహిళ అక్కడి నుంచి వెనుదిరిగారు.

విమానం రద్దు కావడంతో గంటల తరబడి వేచి చూసిన ప్రయాణికులకు సరైన సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం ఈ ఘటనకు కారణమైందని తెలుస్తోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానం రద్దుతో మహిళ ఆగ్రహం.. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదం

ADVERTISEMENT