LOADING...
Hyderabad: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం

Hyderabad: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నగరంలోని బాచుపల్లిలోని ఓఖాళీ ప్రదేశంలో ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే,రెడ్డీస్ ల్యాబ్‌ ప్రహరీ గోడకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఓసూట్‌కేసు పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. ఆబ్యాగ్‌ నుంచి దుర్వాసన రావడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం అక్కడికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసును ఓపెన్ చేయగా అందులో ఒక మహిళ మృతదేహం ఉండటం బయటపడింది. మృతురాలు మెరూన్ రంగు చుడీదార్ ధరించి ఉన్నారు.ఆమె వయసు సుమారు 25నుంచి 30ఏళ్ల మధ్యగా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనాస్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్‌,ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేడ్చల్-బాచుపల్లి పీఎస్ పరిధిలో దారుణం.. బ్యాగులో డెడ్ బాడీ...!