Loading...
IndiGo Employee: స్నేహితుడితో బయటకు వెళ్లిన ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి
స్నేహితుడితో బయటకు వెళ్లిన ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి

IndiGo Employee: స్నేహితుడితో బయటకు వెళ్లిన ఇండిగో ఉద్యోగిని అనుమానాస్పద మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన ఇండిగో విమానయాన సంస్థ ఉద్యోగిని అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఆమె.. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండటం కలకలం రేపింది. ఈ ఘటన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన వర్ష తుర్కర్ (35) కొన్నేళ్లుగా పుణె విమానాశ్రయంలోని ఇండిగో టికెట్ కౌంటర్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు ఇటీవల తన రెండేళ్ల కుమార్తెతో కలిసి బాలాఘాట్ జిల్లాలోని పుట్టింటికి వెళ్లారు.

వివరాలు 

తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో వర్ష

ఈ క్రమంలో శనివారం సాయంత్రం తన స్నేహితుడు నితేశ్ అగర్వాల్‌తో కలిసి వర్ష వైన్‌గంగ నది ప్రాంతానికి వెళ్లారు.

కొంతసేపటి తర్వాత నితేశ్.. వర్ష కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు.

మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేసినట్లు చెప్పాడు.

దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

అయితే, అప్పటికే వర్ష తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో కనిపించారు.

దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

వివరాలు 

స్నేహితుడి వాంగ్మూలంపై పోలీసులకు అనుమానాలు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ముసుగులు ధరించిన కొందరు దుండగులు తమపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని నితేశ్ పోలీసులకు తెలిపాడు.

అయితే,ఈ ఘటనలో వర్ష తీవ్రంగా గాయపడగా.. నితేశ్‌కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అతడు చెప్పిన వివరాలపై పోలీసులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

పోలీసుల విచారణలోనూ నితేశ్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వర్షపై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ హత్య వెనుక అసలు కారణాలు ఏమిటి? ఘటన జరిగిన సమయంలో ఏం జరిగింది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, వర్ష భర్త ప్రస్తుతం ఇందౌర్‌లో ఉన్నట్లు సమాచారం.

ADVERTISEMENT