Maharastra: మహారాష్ట్రలో దారుణ ఘటన.. ఆగిఉన్న బస్సులోకి యువతిని తీసుకెళ్లి..
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని పుణే నగరంలో మంగళవారం ఉదయం స్వార్‌గేట్ జంక్షన్ బస్టాండ్‌లో జరిగిన ఘోర ఘటన కలకలం రేపింది.
ప్రభుత్వ బస్సులో 26 ఏళ్ల మహిళపై 36 ఏళ్ల నేరస్తుడు లైంగిక దాడి చేసి పరారయ్యాడు.
మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అత్యంత రద్దీగా ఉండే బస్‌జంక్షన్‌లలో ఒకటైన స్వార్‌గేట్ బస్టాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రజలను తీవ్రంగా కలతపరిచింది.
నిందితుడిని గుర్తించిన పోలీసులు
సంఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి, అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
దర్యాప్తులో నిందితుడిని దత్తాత్రేయ రాందాస్ గాడేగా గుర్తించారు. అతనిపై గతంలో దొంగతనం, దోపిడీ, చైన్ స్నాచింగ్ వంటి అనేక కేసులు నమోదయ్యాయి.
వివరాలు
ఎలా జరిగింది ఘటన?
పోలీసుల వివరాల ప్రకారం, బాధిత మహిళ మంగళవారం తెల్లవారుజామున 5.45 గంటలకు సతారా జిల్లాలోని ఫల్‌టణ్ పట్టణానికి వెళ్లే బస్సును ఎక్కేందుకు బస్టాండ్‌లో వేచిచూస్తోంది.
అదే సమయంలో నిందితుడు ఆమె దగ్గరకు వచ్చి, తాను బస్ కండక్టర్ అని నమ్మించాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు సమీపంలో ఉందని చెప్పి, 'శివ్ షాహీ' ఏసీ బస్సును చూపించాడు.
నిందితుడి మాటలు నమ్మిన మహిళ ఎవరూ లేని ఆ బస్సు ఎక్కింది.
బస్సులో చీకటిగా ఉండటంతో తొలుత ఆమె సందేహించింది. అయితే, అతను ప్రయాణికులు నిద్రపోతున్నారని నమ్మబలికాడు.
ఆమె పూర్తిగా లోపలికి వెళ్లాక, నిందితుడు బస్సు తలుపు మూసేసి, ఆమెపై లైంగిక దాడి జరిపి అక్కడి నుంచి పారిపోయాడు.
వివరాలు
పోలీసులకు ఫిర్యాదు
ఘటన జరిగినప్పటికీ, బాధిత మహిళ తొలుత ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఫల్‌టణ్ వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యంలో తన స్నేహితురాలికి కాల్ చేసి విషయం వివరించింది.
ఆమె సలహామేరకు వెంటనే బస్సు దిగిపోయి సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు చర్యలు
పోలీసులు భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ బస్టాండ్ సమీపంలోని పోలీస్‌స్టేషన్ కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. నిందితుడు 2019లో ఒక కేసులో బెయిల్‌పై విడుదలయ్యాడు.
వివరాలు
రాజకీయ విమర్శలు
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ''రాష్ట్రంలో అసాంఘిక శక్తులు భయపడకుండా తిరుగుతున్నాయి.
హోం శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి నేర నియంత్రణలో విఫలమయ్యారు'' అని ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు, ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు.