Page Loader
Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం..
బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం..

Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం..

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సూట్‌కేస్‌లో ఒక మహిళ మృతదేహం లభ్యమవడం చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపింది. ఈ సంఘటన బెంగళూరులోని చందాపుర రైల్వే బ్రిడ్జ్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. చందాపుర రైల్వే బ్రిడ్జ్‌ సమీపంలో ఉన్న ఒక సూట్‌కేస్‌పై స్థానికులు గుర్తించారు. వారు దాన్ని తెరిచి చూసినప్పుడు గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

వివరాలు 

కేసు నమోదు

మహిళను వేరే చోట హత్య చేసి,అనంతరం రైలు ద్వారా ఇక్కడికి తీసుకువచ్చి విసిరేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతురాలి వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. ఆమె ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? అనే విషయాలు తెలియరాలేదు. పోలీసులు ఈ కేసును నమోదు చేసి, పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు.