Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలోని యమునా ఖాదర్ వద్ద ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మృతదేహం బుధవారం ఉదయం పోలీసులకు లభ్యమైంది.
ఐదు ముక్కలుగా నరికిన మృతదేహం పాలిథిన్ సంచుల్లో కనిపించిందని, తల మాత్రం ఆ సంచిలో లేదని పోలీసులు తెలిపారు. అయితే ఆ మృతదేహం మహిళదేనని పోలీసులు నిర్ధారించారు.
ఆర్థో ఫోరెన్సిక్స్ సాయంతో మరిన్ని ఆధారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని, విచారణ పురోగతిలో ఉందని డిప్యూటీ పోలీసు కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు.
సంఘటనా స్థలం వద్ద శరీర భాగాలు కనిపించినట్లు ఉదయం 9.15 గంటలకు కంట్రోల్ రూంకు కాల్ వచ్చిందని పోలీసులు డీసీపీ తెలిపారు.
దిల్లీ
హత్య వేరే చోట చేసి ఉంటారని పోలీసుల అనుమానం
కంట్రోమ్ రూమ్ కాల్‌కు వచ్చిన వెంటనే ప్రత్యేక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొన్ని శరీర భాగాలు మొదట బ్యాగ్‌లో కనిపించగా మరికొన్ని కనిపించలేదు.
దీంతో చుట్టుపక్కల వెతకగా కొంత దూరంలో మరిన్ని శరీర భాగాలతో కూడిన మరో బ్యాగ్ లభ్యమైంది. శరీర భాగాలు లభ్యమైన ఈ ప్రాంతాలు కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి.
ఫోరెన్సిక్ నిపుణులు, క్రైమ్ స్పాట్ ఇన్వెస్టిగేషన్ బృందాన్ని పిలిచి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేసి, ఆధారాలు సేకరించినట్లు కల్సి తెలిపారు. మృతురాలి వయసు 35 నుంచి 40ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
వేరే చోట హత్య చేసి, శరీర భాగాలను యమునా ఖాదర్ వద్ద పడేసి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.