Page Loader
Brave Women: తల్లీకుమార్తెల ధైర్యానికి దుండగుల పరార్‌.. బేగంపేటలో ఘటన 
Brave Women: తల్లీకుమార్తెల ధైర్యానికి దుండగుల పరార్‌.. బేగంపేటలో ఘటన

Brave Women: తల్లీకుమార్తెల ధైర్యానికి దుండగుల పరార్‌.. బేగంపేటలో ఘటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 22, 2024
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ బేగంపేట ప్రాంతంలోని రసూల్‌పుర జైన్‌ కాలనీలో నవరతన్‌ జైన్‌ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. గురువారం కొరియర్‌ డెలివరీ బాయ్ రూపంలో పట్టపగలు తుపాకీతో ఇంట్లోకి చొరబడి దోపిడీ కోసం బెదిరించిన దుండగుల్నినవరతన్‌ జైన్‌ భార్య అమిత మేహోత్‌ ధైర్యంగా నిలబడి నిందితుడితో కలబడిందని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 2 :15 గంటల సమయంలో ఇద్దరు సాయుధ వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అమిత, ఆమె కుమార్తెను పిస్టల్‌తో బెదిరించారు. సంఘటన CCTV ఫుటేజీలో రికార్డు అయ్యింది. దుండగుల్లో ఒకరు హెల్మెట్ ధరించి నాటు తుపాకీని ఆమెకు గురిపెట్టాడు. మరొక దుండగుడు ఇంటి పనిమనిషి మెడపై కత్తి పెట్టి ఆపై ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు ఇవ్వాలని కోరాడు.

Details 

ఇంటి లోపలే మరో నిందితుడు 

దాంతో హెల్మెట్ ధరించిన వ్యక్తిని కాలితో అమిత తన్ని అతనిని బయటికి నెట్టుకుంటూ వచ్చింది. ఈ లోపు ఆమె కుమార్తె కూడా రావడంతో ఇద్దరు గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైనా సుశీల్‌ దాడి చేస్తున్నా సరే గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇక చేసేది ఏమి లేక అతడు తుపాకీ వదిలి పరారయ్యాడు. అతనితో పాటు వచ్చిన మరో నిందితుడు మరో మార్గంలో పారిపోయేందుకు ప్రయత్నం చేసాడు. కాకపోతే దారి దొరకకపోవడంతో లోపలే ఉండిపోయాడు. పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, దొంగలను పట్టుకోవడంలో తల్లీ, కూతురు సాహసం చేశారని కొనియాడారు.

Details 

పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు 

మీడియాతో ఆమె మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం కాలనీలో చోరీకి ప్రయత్నించిన వారు 2022లో, దీపావళి సమయంలో వారి ఇంటికి పనికి వచ్చి నాలుగు రోజులు పనిచేశారని తెలిపారు. ఇద్దరు నిందితులు దోపిడీకి ప్లాన్‌తో వచ్చి రెండు రోజుల క్రితం రెక్కీచేశారని .. కొరియర్ ఇచ్చే సాకుతో ఇంట్లోకి వచ్చారని తెలిపారు. కిక్ బాక్సింగ్‌లో శిక్షణ పొందడం వల్లే దొంగల నుంచి తప్పించుకుని కూతురిని, ఇంటిని కాపాడుకోగలిగానని అమిత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. దాడికి పాల్పడిన వారి నుంచి కంట్రీ మేడ్ రివాల్వర్, ఐదు లైవ్ రౌండ్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిసి టివిలో రికార్డు అయ్యిన దృశ్యాలు