NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం
    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం
    1/3
    భారతదేశం 0 నిమి చదవండి

    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం

    వ్రాసిన వారు Naveen Stalin
    May 28, 2023
    10:41 am
    కొత్త పార్లమెంట్‌ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం
    కొత్త పార్లమెంట్‌కు మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్ద మహాపంచాయత్‌కు పిలుపునిచ్చారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో దిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు, మల్లయోధులు మద్దతుదారులు రెజ్లర్ల మద్దతులో పాల్గొనున్న నేపథ్యంలో తిక్రీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అంతరాయం కలిగించేలా రెజ్లర్ల నిరసనకు, మార్చ్‌కు అనుమతి లేదని దిల్లీ పోలీసు స్పెషల్ సీపీ దీపేందర్ పాఠక్ తెలిపారు.

    2/3

    ఘాజీపూర్ సరిహద్దులో 144 సెక్షన్ విధింపు

    అయితే రెజ్లర్లు పోలీసులు హెచ్చరికలను లెక్కచేయడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త భవనం దగ్గరే తమ మహిళా మహాపంచాయతీ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. ఈ క్రమంలో దిల్లీ పోలీసులు మౌలానా ఆజాద్ రోడ్, ఐటీఓ రోడ్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులను రాజధానిలోకి ప్రవేశించకుండా పంచాయితీ ఏర్పాటు చేయడాన్ని నిరోధించేందుకు పోలీసులు నగరానికి వెళ్లే సరిహద్దులన్నింటినీ చుట్టూ రాతి బారికేడ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవనం అత్యంత భద్రత ఉన్న ప్రాంతంలో ఉందని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘాజీపూర్ సరిహద్దులో 144 సెక్షన్ విధించినట్లు, చట్టాలను ఉల్లంఘించవద్దని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు నిరసనకారులను హెచ్చరించారు.

    3/3

    ఘాజీపూర్ వద్ద బలగాల మోహరింపు

    #WATCH | Security tightened near Ghazipur border area; Khap panchayat leaders, farmers to join protesting wrestlers' march to new parliament house in Delhi today. pic.twitter.com/7Bn6LljB6J

    — ANI (@ANI) May 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    రెజ్లింగ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీ

    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే లోక్‌సభ
    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? నరేంద్ర మోదీ

    రెజ్లింగ్

    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్  తాజా వార్తలు
    WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం కన్నుమూత ప్రపంచం
    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు దిల్లీ

    తాజా వార్తలు

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కర్ణాటక
    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు దిల్లీ
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్
    హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం  హైదరాబాద్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023