Amaravati: అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టు.. దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధాని!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ఇప్పటికే అమరావతిలో వివిధ నిర్మాణాలు ప్రారంభించారు. ః
ఐకానిక్ టవర్స్, 100 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనం, వరదనీటి నిర్వహణ కోసం కెనాల్స్, రిజర్వాయర్లు, వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాకులు, ఇలా అన్ని అవసరమైన సౌకర్యాలు అమరావతిలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ పనులు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన ప్రాజెక్టు అమలుకు సిద్ధమవుతోంది.
అమరావతిని దేశంలోనే తొలి పైప్డ్ గ్యాస్ రాజధానిగా తీర్చిదిద్దేందుకు భారతీయ ఆయిల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది.
Details
గ్యాస్ పైపులైన్ల నిర్మాణం
గుజరాత్‌లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతిలో కూడా పైప్డ్ గ్యాస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
ఈ ప్రాజెక్టును పలు అంశాలలో చర్చించేందుకు ఐవోసీ ప్రతినిధులు, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యులతో కలిసి ఏపీ ప్రభుత్వ కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, ఇతర అవసరమైన ప్రాజెక్టుల గురించి చర్చలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అంగీకరించడంతో, త్వరలో అమరావతిలో గ్యాస్ సరఫరా కోసం భూగర్భంలో పైప్లైన్ల నిర్మాణం మొదలు కానుంది.
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీతో పోలిస్తే, ఇందులో అన్ని సౌకర్యాలు భూగర్భంలోనే ఏర్పాటు చేయనున్నారు.
Details
భవిష్యత్తులో మంగళగిరి ప్రాంతాలకు
ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా, గ్యాస్, వ్యర్థాలను కూడా భూగర్భంలో పైపుల ద్వారా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
దీంతో విద్యుత్ సంబంధిత ప్రమాదాలు, గ్యాస్ సరఫరా విషయంలో సమస్యలు తలెత్తకుండా చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు.
భవిష్యత్తులో మంగళగిరి, అమరావతి తదితర ప్రాంతాలకు కూడా ఈ పైప్డ్ గ్యాస్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. తద్వారా అమరావతి మరింత ఆధునిక నగరంగా ఎదగడం ఖాయమవుతోంది.