ఉగ్రరూపం దాల్చిన యమూనా నది.. క్రేజీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి ముగిగాయి. సివిల్‌లైన్స్ ప్రాంతంలో రింగ్ రోడ్డు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుంది.
కాశ్మీరీ గేట్- మంజు కా తిలాని కలిపే ప్రాంతాల్లో భారీగా వరద చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం సమీపంలోనూ వరద నీరు చేరడం గమనార్హం.
భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది.
గురువారం ఉదయం 9 గంటల సమయానికి నదినీటి మట్టం 208.51 మీటర్లకు చేరింది.
Details
పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
యమునా నది ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. 1978లో నీటిమట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తారు.
ప్రస్తుతం ఆ రికార్డును కూడా దాటడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
హర్యానా బ్యారేజీ నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి నీటి ప్రవాహం తగ్గుతుందని కేంద్ర జల సంఘం తెలిపింది.
లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరదలు పొంచి ఉండటంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.
ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవును ప్రకటించారు.