Loading...
Yanamala Krishnudu: వైసీపీకి యనమల కృష్ణుడు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక

Yanamala Krishnudu: వైసీపీకి యనమల కృష్ణుడు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2026
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి చెందిన యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అమరావతిలో జనసేన కేంద్ర కార్యాలయంలో.. శుక్రవారం రాజధాని అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యనమల కృష్ణుడు జనసేనలో చేరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ స్వయంగా కండువా వేసి కృష్ణుడిని పార్టీలోకి ఆహ్వానించారు.

వివరాలు 

2024 ఎన్నికల్లో టీడీపీలో అవకాశం దక్కకపోవడంతో..

2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో యనమల కృష్ణుడికి అవకాశం దక్కలేదు.

ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. అయితే తాజాగా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం తుని నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

కృష్ణుడు.. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి సోదరుడు.

మూడు రోజులుగా వైసీపీలో వరుస రాజీనామాలు

గత మూడు రోజులుగా వైసీపీలో పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు.

గురువారం నంద్యాలలో మాజీ సర్పంచ్‌తోపాటు దాదాపు 200 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేశారు.

అనంతరం వారంతా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

వివరాలు 

విజయనగరంలోనూ పలువురు జడ్పీటీసీల రాజీనామా

అంతకుముందు బుధవారం విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన పలువురు జడ్పీటీసీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

అనంతరం వారు టీడీపీలో చేరారు. వీరంతా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అనుచరులుగా ఉన్నారు.

కేడర్ కూడా పార్టీని వీడుతుందా?

విజయనగరం జిల్లాలో మజ్జి శ్రీనివాసరావుతోపాటు పలువురు నేతలు, పార్టీ కేడర్ కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మజ్జి శ్రీనివాసరావు సమీప బంధువు.

ADVERTISEMENT

వివరాలు 

అగ్రనాయకత్వం దృష్టి విజయనగరంపై?

మజ్జి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేయడంతో విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితిపై వైసీపీ అగ్రనాయకత్వం దృష్టి సారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల ముందు వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఆ పార్టీ రాజకీయ పరిస్థితిపై చర్చకు దారితీస్తున్నాయి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమరావతిలో జనసేన కండువా కప్పుకున్న యనమల కృష్ణుడు

ADVERTISEMENT