
Perni Nani: '76 ఏళ్ల ముసలోడివి.. ఎంతకాలం బతుకుతావ్?'.. సీఎం చంద్రబాబుపై పేర్ని నాని వివాస్పద వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత పేర్ని నాని ఇటీవల పెడనలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, ఆయన వయసును ప్రస్తావిస్తూ — "76 ఏళ్ల ముసలివి నువ్వు ఇంకెంతకాలం బ్రతుకుతావ్? 50 ఏళ్ల జగన్‌ను భూస్థాపితం చేస్తావా? అది నీ స్థాయి కాదు,నీ కొడుకు స్థాయి కూడా కాదు" అంటూ దాడికి దిగారు. రాష్ట్రంలోని పచ్చ మహిళలతో నన్ను తిట్టిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని వ్యాఖ్యలు అంతటితో ఆగకుండా, తనపై వచ్చిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. "నేను ఎప్పుడూ నరికేయమని అనలేదు. చెబితే పట్టపగలే వేసేయమని చెబుతాన్రా, కానీ చీకట్లో దాడి చేయమని చెప్పలేదు" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
వివరాలు
'ఎవడొస్తాడో రండ్రా.. దమ్ముంటే చెడ్డీతో నడిపించండ్రా చూద్దాం..'
ఎన్నికల ముందు టీడీపీ నేతల చేసిన ప్రసంగాల వీడియోలను ప్రదర్శిస్తూ, అవమానకర పదజాలంతో విమర్శలు చేశారు. "ఎన్నికల ముందు నారా లోకేశ్ వల్లభనేని వంశీని ఏదో చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత వంశీని అయిదు నెలలు బెజవాడ జైలులో ఉంచారు. తర్వాత ఏమయ్యింది?" అని ప్రశ్నించారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై వ్యాఖ్య చేస్తూ, ఆయన త్వరలో తిరిగి రంగంలోకి వస్తారని తెలిపారు. "ఆరోగ్య సమస్యలు దూరం చేసుకొని, మరో మూడు నెలల్లో నాని గుడివాడకు వస్తాడని.. దమ్ముంటే చెడ్డీతో నడిపించండ్రా చూద్దాం..' అని రెచ్చగొట్టారు.
వివరాలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అసభ్య పదజాలం..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. "అయ్యన్నపాత్రుడు 80ఏళ్లైనా ఇంకా చావలేదు"అంటూ ఎద్దేవా చేశారు. కొల్లు రవీంద్రను ఉద్దేశించి కూడా తీవ్ర విమర్శలు చేస్తూ, "ఇతను కొల్లు రవీంద్ర కాదు.. సొల్లు రవీంద్ర. అన్నం తినకుండా బ్రాందీ షాపుల కమీషన్ల మీద జీవిస్తున్నాడు. కృత్తివెన్నులో 45ఎకరాల భూమిని ఆక్రమించాడు. ఇందుకు సంబంధించి ఆధారాలతో త్వరలో బయట పెడతాను" అని పేర్కొన్నారు. మీడియాపై కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. "జగన్ పేరుతో ఇన్నాళ్లు చర్చలు పెట్టి పబ్బం గడుపుకొన్నారు.నిన్న ఒక్కరోజు నా పేరు మీద చర్చ పెట్టారు. కూటమి నేతల వ్యాఖ్యలపై మాత్రం ఎందుకు చర్చ పెట్టరా?వారి బియ్యం మీకు రుచిగా ఉండవా?" అంటూ మీడియాపై విమర్శలు గుప్పించారు.