తదుపరి వార్తా కథనం
R. Krishnaiah: వైసీపీ కి మరో షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ రాజీనామా
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 24, 2024
06:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేశారు.
కృష్ణయ్య రాజీనామాకు రాజ్యసభ్య చైర్మన్ ఆమోదం తెలిపారు. కాగా, త్వరలో కృష్ణయ్య కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
బీజేపీ వర్గాలు కూడా ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ధ్రువీకరించే అవకాశం ఉంది.
ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత కృష్ణయ్యను పార్టీలోకి చేర్చుకుంటే బీసీలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఈ మేరకు ఆర్. కృష్ణయ్యతో పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఆఫర్‌కు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.