Page Loader
IMD: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ
హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ

IMD: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2024
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగిన ఆవర్తనం మంగళవారం నాటికి బలహీనపడింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదారాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉంది. అయితే ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Details

బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం

ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతంలో కొనసాగిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ మంగళవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 23న తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ 24న ఉదయానికి తీవ్ర తుపానుగా ఉద్ధృతి చెంది ఒడిశా-పశ్చిమబెంగాల్‌ తీరాన్ని 24న రాత్రి లేదా 25న ఉదయం పూరి, సాగర్‌ ఐలండ్స్‌ మధ్య దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం తెలంగాణపై ఉండే అవకాశం లేదని అధికారులు తెలిపారు.