Page Loader
YELLOW ALERT: తెలంగాణకు వర్ష సూచన.. మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
తెలంగాణకు వర్ష సూచన

YELLOW ALERT: తెలంగాణకు వర్ష సూచన.. మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 09, 2023
06:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మూడ్రోజుల పాటు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.

Details

రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు

జులై 9వ తేదీన హైదారాబాద్‌‌లో రాత్రి సమయాల్లో చిరుజల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌, ములుగు, హన్మకొండ, వరంగల్‌, జనగామ, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో ఆదివారం ఉదయ వరకు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.