
Youth Aattacked in Karnataka: బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన యువకుడిపై దాడికి పాల్పడ్డ ముస్లిం యువత..
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక (Karnataka) లోని చిత్రదుర్గ (Chithra Durga)లో పని ముగించుకుని ముస్లిం సహోద్యోగిని దింపుతున్నాడన్న కారణంతో యువకుడిపై గురువారం కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు.
ద్విచక్రవాహనంపై తనను దింపుతానని చెప్పి నమ్మకంగా ఎక్కించుకున్న సదరు యువకుడు తనను దించే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించాడని యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈరజ్జనహట్టి (Eerajjanahatti) కి చెందిన ఉమేష్ నగరంలోని కోహినూర్ (Kohinoor) వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు.
గురువారం రాత్రి 8 గంటల సమయంలో, సదరు యువకుడు పని ముగించుకుని తన సహోద్యోగి పర్వీన్ ని దింపడానికి చెలుగుడ్డ(Chelugudda) వైపు వెళుతుండగా, ఐదుగురు యువకులు అతన్ని అడ్డుకుని, ముస్లిం మహిళకు లిఫ్ట్ ఇచ్చాడనే కారణంతో సదరు యువకుడిపై దారుణంగా దాడి చేశారు.
YOuth Attacked-Karnataka
ఉమేష్ ను పరామర్శించిన పోలీసు అధికారులు
దీంతో యువకుడి తల, ఇతర శరీరభాగాలపై గాయాలయ్యాయి.
దీంతో ఉమేష్ చిత్రదుర్గ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎస్పీ ధర్మేందర్ కుమార్,డిప్యూటీ ఎస్పీ దినకర్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఉమేష్ ను పరామర్శించారు.
విషయం తెలుసుకున్నహిందూ సంఘం కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగి ఉమేష్ పై దాడి చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమేష్ తనను దించే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కనక సర్కిల్(Kanaka Circle)దిగాల్సి ఉండగా తనను చంద్రవల్లి (Chandravalli)తోటవైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని దీంతో తన సోదరుడికి ఫోన్ చేయగా తన స్నేహితులతో వచ్చి ఉమేష్ బారి నుంచి తనను రక్షించి ఇంటికి క్షేమంగా పంపించారని పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.