
Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పై గూఢచర్య కేసులో భారీ షాక్ తగిలింది.
పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)తో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మెటా సంస్థ బ్లాక్ చేసి సస్పెండ్ చేసింది.
అయినప్పటికీ ఆమె యూట్యూబ్ ఛానెల్ 'ట్రావెల్ విత్ జో' ఇంకా అందుబాటులో ఉంది.
జ్యోతి మల్హోత్రాను సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందిస్తున్నారంటూ ఆరోపణల తర్వాత శనివారం అరెస్టు చేశారు. 2023లో పాక్‌కు కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందుకుని వెళ్లింది.
Details
ఇన్ఫార్మర్లుగా ఐదుగురు వ్యక్తులు
పాక్ అధికారులకు అనుమానం రాకుండా కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించారు.
అంతేకాక ఆమెతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వీరు భారతదేశంలోని ముఖ్య ప్రాంతాల సమాచారం పాక్ తో పంచుకున్నారు. దర్యాప్తు లో ఆమె పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.
ఆమె అతడితో పాటు బాలి, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా అంతర్జాతీయ ప్రయాణాలు చేసింది.
జ్యోతి మల్హోత్రాపై భారతీయ న్యాయసంహితలో సెక్షన్ 152 సహా పలు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు సమయంలో ఆమె తప్పు ఒప్పుకుంది.
Details
వీడియోను పాక్ ఏజెంట్లతో పంచుకున్నట్లు సమాచారం
అలాగే, ఆమెతో పాటు మరో ఐదుగురు సహకారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పహల్గాం ఉగ్రదాడికి కొన్ని నెలల ముందే జ్యోతి ఆ ప్రాంతంలో పర్యటించి వీడియోలు తీసినట్లు దర్యాప్తు లో వెల్లడయింది. ఆ వీడియోలను పాక్ ఏజెంట్లతో పంచుకున్నారని అనుమానిస్తున్నారు.
అలాగే, జమ్ము కశ్మీర్‌లో తరచూ పర్యటన చేసి, చైనా కూడా పర్యటించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఇంకా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.