Loading...
YouTuber Nandana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

YouTuber Nandana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూట్యూబర్‌ నందన (YouTuber Nandana)ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ కావడంతో విమానాశ్రయంలో పోలీసులు నందనను గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు తెలియజేశారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు నందన దంపతులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు కావడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. నందనపై నమోదైన కేసులు, ఆమెకు జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసుల వివరాలను పరిశీలిస్తున్న పోలీసులు.. తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ADVERTISEMENT