LOADING...
YS Vijayamma: షర్మిలకు మద్దతు తెలుపుతూ వైఎస్ విజయమ్మ వీడియో విడుదల 
షర్మిలకు మద్దతు తెలుపుతూ వైఎస్ విజయమ్మ వీడియో విడుదల

YS Vijayamma: షర్మిలకు మద్దతు తెలుపుతూ వైఎస్ విజయమ్మ వీడియో విడుదల 

వ్రాసిన వారు Stalin
May 11, 2024
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్ విజయమ్మ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమె ఈమేరకు వీడియో సందేశం విడుదల చేశారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూనే కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు మద్దతు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు వెలువడిన వీడియో సందేశంలో కడప ఓటర్లు షర్మిలకు అండగా ఉండాలని,వచ్చే ఎన్నికల్లో షర్మిల విజయం సాధించాలని విజయమ్మ అభిలషించారు. ''కడప ప్రజలకు,వైఎస్సార్‌ను అభిమానించే,ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్‌ బిడ్డ షర్మిలమ్మ కడప జిల్లా నుండి ఎంపీగా పోటీ చేస్తోంది.కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా'' అని విజ్ఞప్తి చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షర్మిలకు మద్దతు తెలుపుతూ వైఎస్ విజయమ్మ వీడియో