Page Loader
 వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు 
వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు

 వైఎస్ వివేకా హత్య కేసు: అవినాష్‌రెడ్డి బెయిల్‌పై స్టే విధించిన సుప్రంకోర్టు 

వ్రాసిన వారు Stalin
Apr 21, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ ప్రశ్నిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే ఏప్రిల్ 24వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించడంతో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరటనిచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మద్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించిన కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్నది. ముందస్తు బెయిల్‌పై స్టే ఇస్తే, ఎంపీని సీబీఐ అరెస్టు చేస్తుందని అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

వైఎస్ వివేకా

అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదా?

అన్ని వాదనలు విన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ముందస్తు బెయిల్ ఆర్డర్‌పై స్టే జారీ చేసింది. అదే సమయంలో అవినాష్‌ను ఏప్రిల్ 24 వరకు అరెస్టు చేయవద్దని సిబిఐని ఆదేశించింది. ఆ రోజున అన్ని విషయాలపై విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. వివేకా కేసు విచారణను ఈ నెల 30లోపు పూర్తి చేయాలంటూ సీబీఐకి ఇప్పటికే సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో ఈ పరిణామం ఈ కేసులో ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్‌ను తొలగిస్తే, సీబీఐ కచ్చితంగా అవినాష్‌ను అరెస్టు చేస్తుంది. అలాగే అతనిపై హత్య కేసును కూడా నమోదు చేయవచ్చు. అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్‌ను యథాతథంగా ఉంచినట్లయితే, ఈ కేసులో అది మరో ట్విస్ట్ అవుతుంది.