Zeeshan Siddique:రాహుల్ గాంధీని కలవాలంటే 10 కిలోలు తగ్గాలట.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన జీషన్ సిద్ధిక్
ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుండి తొలగించబడిన ఒకరోజు తర్వాత,కాంగ్రెస్ ఎమ్మెల్యే,బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్ గురువారం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో భేటీ కావాలనుకున్న తనకు బృందంలోని ఒక వ్యక్తి తాను వయనాడ్ ఎంపీని కలవాలనుకుంటే 10కేజీల బరువు తగ్గాలని అడిగాడని ఆయన ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో,జీషన్ తండ్రి,బాబా సిద్ధిక్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే జీషన్ సిద్ధిక్ ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తొలగించింది.తనను ఎందుకు తొలగించారనే విషయం పై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని ఆయన వాపోయారు.