Page Loader
ప్రతిష్టాత్మక కోల్​కతా ట్రామ్​కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ
దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ

ప్రతిష్టాత్మక కోల్​కతా ట్రామ్​కు 150 ఏళ్లు.. దుర్గా పూజా విశేషాలతో ప్రత్యేక అలంకరణ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 10, 2023
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్​లో దుర్గాపూజ సహా కోల్​కతా ట్రామ్ కారు​ సేవలు ప్రారంభమై 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ట్రామ్​ను రూపొందించారు. 1873లో తొలి ట్రామ్ ప్రారంభమైంది. ట్రామ్ లోపలే కాకుండా బయట కూడా అందమైన చిత్రాలతో అలకరించడం ఆకట్టుకుంటోంది.ఈ ట్రామ్​ టోలీగంజ్​- బాలీగంజ్​ మధ్య కొత్త సంవత్సరం -2023 వరకు సేవలను అందించనుంది. చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలను కలుపుతూ ఈ ట్రామ్​ సాగనుంది. దీన్ని ఏషియన్ పెయంట్స్​, XXL కలెక్టివ్​తో కలిసి బెంగాల్​ ట్రాన్స్​పోర్ట్ కార్పొరేషన్​ జాయింట్ ప్రాజెక్టుగా చేపట్టింది. తొలి బోగిలో దుర్గా విగ్రహాలను సుందరంగా చెక్కి,అమ్మవారి పూజా విశేషాలను పొందుపర్చారు. సింధూర్​, ధునుచి నృత్య కళాకారుల బొమ్మలనూ అందంగా గీశారు. రెండో బోగిని సంస్కృతిని తెలిపేలా తీర్చిదిద్దారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆకట్టుకుంటున్న కోల్​కతా ట్రామ్ కారు స్పెషల్ డిజైన్​