ఈ ఐదు రకాల పువ్వులు తింటే పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం
చెట్టుకు కాసిన కాయలు,పండ్లు తింటేనే పోషకాలు కాదు. పువ్వులు తిన్నా పుష్కలమైన పోషకాలు లభిస్తాయి. ఈ మేరకు పలు రకాల పువ్వుల్లోని ఆహారంతో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఒక్క పువ్వు తింటే చాలు మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. 1. గులాబీ అందరూ ఎక్కువగా ఇష్టపడే పువ్వుల్లో గులాబీ ఒకటి. దీని రుచి అద్భుతంగా ఉంటుందని మీకు తెలుసా.వంటకాల్లోనూ ఇది గొప్ప రుచిని అందిస్తుంది.రోజ్ మిల్క్ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యాన్ని అందించే గులాబీలో ఏ,ఈ విటమిన్లు ఉంటాయి. 2. మందార మందారలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను సమర్థంగా తగ్గిస్తుంది. కాలేయ రుగ్మతను నివారిస్తుంది. దీన్ని క్రమంగా తీసుకుంటే జుట్టు, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చాలా మంది లావెండర్- చమోమిలే చాయ్ తాగడం ఇటీవలే బాగా పెరిగింది
3. మేరిగోల్డ్- బంతి ఇది చర్మ వ్యాధులను నయం చేస్తుంది. బంతి పువ్వును తినవచ్చని తెలుసా. మేరిగోల్డ్ తినడం వల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు పువ్వులో క్యాన్సర్ నివారణ కోసం ఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఈ పువ్వుతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. 4. లావెండర్- చమోమిలే లావెండర్, చమోమిలే పువ్వులతో చాలా మంది టేస్టీ ఛాయ్ తాగడం ఇటీవలే బాగా పెరిగింది. ఈ రెండు పువ్వులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేనా మంచి నిద్రను సైతం అందిస్తాయి. 5. వైలెట్లు దీన్ని వైల్డ్‌ఫ్లవర్‌గా భావిస్తారు. ఈ చిన్న పుష్పాల్లో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్‌లు కలిగి ఉన్నాయి. వీటిని తీసుకుంటే రక్తనాళాల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెతో పాటు శ్వాసకోశ సమస్యలకు చెక్ పెట్టడంలో సహకరిస్తుంది.
పువ్వులను తీసుకునేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పువ్వులను తినే ముందు ఒకటికి రెండు సార్లు పరిశీలించాకే తీసుకోవాలి. హెర్బల్ నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఈ పువ్వుల వల్ల ఏర్పడే దుష్ప్రభావాల నేపథ్యంలో ముందస్తు పరిశోధనలు అవసరం. బహిరంగ ప్రదేశాల నుంచి తీసిన పువ్వులను అమాంతం తినకూడదు. తినడానికి ముందు పువ్వును బాగా కడగాలి. ఇలాంటి పువ్వులను ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం శ్రేయస్కరం. మార్కెట్ నుంచి పువ్వులను కొనుగోలు చేస్తే, నమ్మకమైన విక్రయదారుల వద్దే కొనుగోలు చేయాలి. ఈ పువ్వులు తిన్న తర్వాత ఏదైనా అలెర్జీ సమస్యలు తలెత్తితే, తక్షణమే వైద్యుడిని సంప్రదించండి. పువ్వులు సురక్షితమైనవే అయినప్పటికీ కొన్నిసార్లు శరీరం కొత్త ఆహారాలకు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది.