వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి
ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన వసంత పంచమి జరుపుకుంటున్నారు.ఈ రోజు సరస్వతీ దేవికి పూజ చేస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతుంటారు. వసంత పంచమి రోజున పసుపు రంగుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. చాలామంది పసుపు బట్టలు ధరిస్తుంటారు. ఇలాంటి పవిత్రమైన రోజు పసుపు రంగులో ఉండే ప్రసాదాలను దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఈ రెసిపీస్ ప్రయత్నించండి. కిచూరి: ఇది బెంగాలీ వంటకం. గరం మసాలా, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని నెయ్యితో మర్దన చేసిన పాత్రలో బాగా వేయించాలి. అప్పుడు దానికి ఉప్పు, క్యారెట్, పల్లీలు, కాలీఫ్లవర్, బంగాళదుంప కలపాలి. వేయించిన పెసరపప్పును, చిట్టిముత్యాలు రకం బియ్యాన్ని కలిపి నీళ్ళు పోసి వండాలి.
సరస్వతీ పూజ రోజున ప్రసాదంలా తినే వెరైటీ పదార్థాల రెసిపీలు
రవ్వ హల్వా: నెయ్యి పూసిన పాత్రలో గోధుమ రవ్వను వేయించి, బెల్లం, నీళ్ళు, కుంకుమ పువ్వు రేకులను కలపాలి. యాలకులపొడిని కలిపి తక్కువ మంటమీద కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది. వండడం పూర్తయ్యాక కాజు, ఎండు ద్రాక్ష, నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. కుంకుమ పువ్వుతో పరమాన్నం: బాస్మతి బియ్యాని కడిగి 30నిమిషాలు నానబెట్టాలి. నలగ్గొట్టిన బాదం, ఎండుద్రాక్ష, కాజు గింజలను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. దానికి ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలను కలిపి వేయించాలి. ఇప్పుడు బియాన్ని వేయండి. కాసిన్ని నీళ్ళు పోసి ఉడికే వరకూ వేచి ఉండాలి. తర్వాత కుంకుమ పువ్వు కలిపిన పాలను, చక్కెరను అందులో కలుపుకోవాలి. అంతే కుంకుమపువ్వుతో పరమాన్నం రెడీ ఐపోయింది.