Yoga: యోగా ద్వారా కంటి వాపును నయం చేయవచ్చు.. ఈ 5 వ్యాయామాలు ఉపశమనం కలిగిస్తాయి
ఉదయం లేవగానే కళ్ల కింద వాపు వచ్చి కొంత సమయం తర్వాత నయమవుతుంది. అయితే, చాలా మందికి కంటి వాపు చాలా రోజుల వరకు తగ్గదు. ఈ సమస్య నీరు నిలుపుదల, డీహైడ్రేషన్, అలెర్జీలు లేదా వృద్ధాప్యం వల్ల కావచ్చు. కళ్లపై ఒత్తిడి కూడా వాపుకు కారణమవుతుంది, ఇది కళ్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీరు ఈ 5 యోగా వ్యాయామాల ద్వారా కంటి వాపును తగ్గించుకోవచ్చు.
పశ్చిమోత్తనాసనం
పశ్చిమోత్తనాసనం విశ్రాంతికి ప్రసిద్ధి. ఈ భంగిమ ముఖం, కళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, తద్వారా వాపు తగ్గుతుంది. దీన్ని చేయడానికి: మొదట నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి ఫ్రీగా కూర్చోవాలి. ఇప్పుడు శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై అనేలా ఉంచాలి. అలాగే తలను మోకాళ్లపై పెట్టే విధంగా చూసుకోవాలి. తర్వాత రెండు చేతులను ముందుకు చాచి రెండు పాదాలను గట్టిగా పట్టుకోవాలి. ఈ ఆసనం చేసేటప్పుడు రెండు మోకాళ్లు, చేతులు నిటారుగా ఉండాలి. వెన్నుపూస వీలైనంతవరకూ పైకి లేవకుండా నిటారుగా పడుకోబెట్టేలా చూసుకోవాలి. ఇలా ఒక 20-30 సెకండ్ల వరకూ ఉండాలి. తర్వాత రిలాక్స్ అవ్వాలి.
అధో ముఖ స్వనాసన
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు అరచేతులను శరీరానికి ముందువైపు నేలపై ఆన్చాలి. నెమ్మదిగా నడుము భాగాన్ని పైకి లేపాలి. మోకాళ్లు వంగకూడదు. పాదాలూ నేలమీద పూర్తిగా ఆనాలి. తలనీ వీలైనంత లోపలికి తీసుకెళ్లి, నాభి ప్రాంతాన్ని చూడండి. దీర్ఘశ్వాస తీసుకొని వదులుతూ ఈ ఆసనంలో 15 సెకన్లు ఉండాలి. తరవాత మోకాళ్లని నేలకు ఆన్చి, టేబుల్ ఆకృతిలోకి, ఆపై వజ్రాసనంలోకీ రావాలి. 20 సెకన్లు విరామం తీసుకుని, మరోసారి చేస్తే సరి.
బాలాసనం
బాలాసనం చేయడానికి, ముందుగా యోగా మ్యాట్‌పై మోకాళ్లను వంచి, మీ శరీర బరువు మొత్తాన్ని మడమల మీద ఉంచి, శ్వాస తీసుకుంటూ ముందుకు వంగండి. ఇలా చేస్తున్నప్పుడు, మీ ఛాతీ తొడలను తాకాలి. అప్పుడు మీ నుదిటితో నేలను తాకడానికి ప్రయత్నించండి. కొంత సమయం పాటు ఈ స్థితిలో ఉన్న తర్వాత, సాధారణ భంగిమకు తిరిగి రావాలి. ఈ ప్రక్రియ 3 నుంచి 5 సార్లు చేయవచ్చు.
మత్స్యాసనం
ముందుగా రిలాక్స్ గా వార్మప్స్ చేయాలి. తర్వాత పద్మాసనం వెయ్యాలి. పద్మాసనంలో ఉండగానే వెల్లకిలా పడుకొని తల నేలపై ఆనించి వీపును పైకి లేపాలి రెండు చేతులతో కాలి బొటనవ్రేల్లను పట్టుకొని మోచేతులను నేలపై ఆనించాలి. కొంతసేపు శ్వాసను ఊపిరితిత్తులలో ఆపి వుంచాలి. తరువాత చేతులపై బరువుంచి మెల్లగా పైకి లేవాలి.. పద్మాసనంలో కొంతసేపు కూర్చొవాలి
అనులోమ్-విలోమ్
అనులోమ్-విలోమ్ నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది కంటి వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం, నేల లేదా చాప మీద పడుకుని నిటారుగా కూర్చోండి. మీ కుడి బొటనవేలును ఉపయోగించి మీ కుడి నాసికా రంధ్రాన్ని మూసివేసి, ఎడమవైపు శ్వాస పీల్చుకోండి. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి కుడి వైపు ద్వారా శ్వాసను వదలండి. కనీసం 10 నిమిషాలు ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.