
Amazing Train Journeys: ఒక్కసారి చూడాల్సిందే.. భారతదేశంలో 10 అద్భుతమైన రైలు ప్రయాణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
మన దేశంలో ఎంతో అందంగా ఉండే పర్యాటక ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రాంతాలున్నాయి.
అయితే వాటిని రైలు ప్రయాణంలో చూస్తూ, ఆస్వాదిస్తే ఆ అనుభవానికి వచ్చే కిక్కు వేరు.
ట్రైన్ జర్నీలో అక్కడి ప్రకృతి, సొగసైన సీనరీలను చూస్తూ వెళ్ళడం ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభవంగా ఉంటుంది.
అలాంటి భారతదేశంలో 10 అద్భుతమైన ట్రైన్ జర్నీ రూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1) ఊటీ నుంచి కూనూర్
టీ గార్డెన్లు, పచ్చని కొండల మధ్యలో ప్రయాణం, అద్భుతమైన సీనరీని మీ కళ్ల ముందు ఉంచుతుంది.
16 సొరంగాలు, 250 బ్రిడ్జ్‌లు ఈ రూట్‌లో ఉంటాయి. మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు ప్రయాణం ఉంటుంది.
Details
2) విశాఖపట్నం నుంచి అరకు లోయ
ఈ రూట్‌లో రైలు ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.
పచ్చని అడవులు, ఎత్తయిన కొండలు, జలపాతాలతో భలే అందంగా ఉంటుంది. ఈ ట్రైన్ జర్నీ దాదాపు 130 కి.మీ ఉంటుంది.
3) చెన్నై నుంచి రామేశ్వరం
పంబన్ సముద్ర వంతెన మీదుగా సాగే ఈ రూట్‌లో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అందాలను చూస్తూ ప్రయాణించవచ్చు. బెస్ట్ టైం మధ్యాహ్నం సమయంలోనే ప్రయాణం చేస్తే ఎంతో ఆనందం కలిగిస్తుంది.
4) ముంబై నుంచి గోవా (కొంకణ్ మార్గం)
కోస్టల్ అందాలను కవర్ చేస్తూ గోవా చేరుకోవచ్చు. ఇది 465 కి.మీ జర్నీ ఉంటుంది. సొగసైన సీనరీలు చూడాలంటే ఈ రూట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
Details
5) హొన్నావర్ నుంచి మంగళూరు
కర్ణాటక తీర ప్రాంతాలు, పచ్చని అడవులను చూస్తూ మంగళూరు దాకా 180 కి.మీ రైల్వే ప్రయాణం అందిస్తుంది.
6) జోధ్‌పూర్ నుంచి జైసల్మేర్
ఎడారి అందాలను చూస్తూ, రాజస్థాన్ సంస్కృతిని ఆస్వాదించవచ్చు. ఈ ట్రైన్ జర్నీ మొత్తం 290 కి.మీ.
7) న్యూ ఢిల్లీ నుంచి అమృత్‌సర్
పంజాబ్ గ్రామాలు, వారి సంస్కృతి చూడాలంటే ఈ రైలులో ప్రయాణం తప్పకుండా ప్రయాణించాల్సిందే. 475 కి.మీ రైలు ప్రయాణం ఉంటుంది.
Details
8) గోవా నుంచి హుబ్లీ
దూద్‌సాగర్ జలపాతం, మొల్లెం నేషనల్ పార్క్ వంటి ప్రదేశాలను ఈ రూట్‌లో చూడవచ్చు. మొత్తం ప్రయాణం 175 కి.మీ.
9) గౌహతి నుంచి దిబ్రూఘర్
అస్సాం తేయాకు తోటలు, కొండ ప్రాంతాల అందాలను కవర్ చేస్తూ ఈ రైల్వే జర్నీ ఉంటుంది. 500 కి.మీ పొడవైన ఈ రూట్ అస్సామీ కల్చర్‌ను చూపిస్తుంది.
10) జమ్మూ నుంచి బనిహాల్
మంచు కప్పిన పర్వతాలు, కాశ్మీర్ లోయ అందాలను చూడాలంటే ఈ రైల్వే మార్గం బెస్ట్. ఈ రూట్ మొత్తం 155 కి.మీ ఉంటుంది.