Page Loader
Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ స్పెషల్‌.. బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా?
అక్షయ తృతీయ స్పెషల్‌.. బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా?

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ స్పెషల్‌.. బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2025
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతేడాది వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. 2025లో ఈ పవిత్ర రోజును ఏప్రిల్ 30న జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, అక్షయ తృతీయను స్వయంసిద్ధ ముహూర్తమని పిలుస్తారు. ఎందుకంటే ఈరోజున ఏ శుభ కార్యమైనా ప్రత్యేకమైన ముహూర్తం చూసే అవసరం లేకుండా నిర్వహించవచ్చు. ఈ ప్రత్యేక దినాన అనేక వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. అందులో ఒకటి ఉప్పు కూడా. చాలామంది ఈ రోజు ఉప్పు కొనడం వెనుక ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకోవాలనుకుంటారు. ఈరోజు పరశురామ జయంతి కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంలో లక్ష్మీ దేవిని ప్రత్యేక పూజలతో ఆరాధించటం ఒక సంప్రదాయం. దీనివల్ల శాంతి, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.

Details

అక్షయ తృతీయ రోజున ఉప్పు ఎందుకు కొనాలి?

ఈ రోజు బంగారం కొనడం ఇంటికి అదృష్టం తెస్తుందని నమ్మకం ఉంది. అలాగే ఉప్పు కొనడం వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని, దాన్ని దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఈ రోజు ఉప్పును కొని దానం చేసే సంప్రదాయం ఉంది. ఎలాంటి ఉప్పు కొనాలి? అక్షయ తృతీయ రోజున సాధారణ రాతి ఉప్పును కొనడం చాలా శుభంగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీ దేవిని ప్రసన్నం చేస్తుందని విశ్వాసం ఉంది. అంతేకాదు రాతి ఉప్పు వాస్తు దోషాలను కూడా తొలగించగలదని నమ్ముతారు. దీనికోసం ఆ ఉప్పును బాత్రూంలో గాజు గిన్నెలో ఉంచడం మంచిదని చెబుతారు. అలాగే వంటల్లో కూడా ఆ ఉప్పును ఉపయోగించవచ్చు.

Details

రాతి ఉప్పు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు

రాతి ఉప్పును భౌతిక సుఖాల అధిపతి శుక్రుడు, మానసిక ప్రశాంతతకు కారణమైన చంద్రుడికి సంబంధించి చూస్తారు. అందువల్ల, అక్షయ తృతీయ రోజున ఈ ఉప్పును కొనడం వల్ల సంపద, శాంతి, మానసిక సంతృప్తి లభిస్తాయని నమ్మకం ఉంది.