
అలస్కాలో కొత్త తరహా బిజినెస్: కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళడానికి ప్రత్యేక బస్
ఈ వార్తాకథనం ఏంటి
కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన బస్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇంటింటికి వచ్చి కుక్కపిల్లలను బస్ లో తీసుకెళ్ళి, ఒక ప్రదేశంలో స్వేఛ్ఛగా వదిలేసి, టైమ్ కాగానే మళ్ళీ ఇంటి దగ్గర దింపి వెళ్లే బస్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపొతారు.
అలస్కాలోని స్కాగ్వే టౌన్ లో లీ, మో థాంప్సన్ అనే ఇద్దరు భార్యభర్తల ఆలోచనా ఫలితం వల్ల కుక్కలను వాకింగ్ కి తీసుకెళ్ళడానికి ప్రత్యేక బస్సు ఏర్పాటైంది.
ఈ విషయాన్ని మో థాంప్సన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బస్ లో కుక్కపిల్లలు కూర్చున్న ఫోటోలు, వాటికి సీట్ బెల్ట్ తగిలించి ఉండడం, ఆ తర్వాత ఒక ప్రదేశానికి తీసుకెళ్ళడం, ఇవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
బిజినెస్
ప్రత్యేక బస్ పెట్టాలన్న ఆలోచన రావడానికి కారణం ఏంటంటే
నిజానికి ఒక కంపెనీలో పని చేస్తున్న మో థాంప్సన్, తన స్నేహితుల కుక్కపిల్లల్ని సరదాగా వాకింగ్ కి తీసుకెళ్లేది. అలా చాలామంది స్నేహితులు తమ కుక్కపిల్లలను వాకింగ్ కి తీసుకెళ్ళమని మో థాంప్సన్ కి అప్పగించేవారు.
దాంతో తన భర్త "లీ" సాయంతో బస్ ఏర్పాటు చేసింది. ప్రతీరోజూ మూడు పూటలు కుక్కలని వాకింగ్ కి తీసుకెళ్తుంది మో. ప్రతీ ట్రిప్ లో 12కుక్కపిల్లలు ఉంటాయి.
బస్ ఆగగానే కుక్కపిల్లలు బస్ ఎక్కుతున్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది మో. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఫలితంగా ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
కుక్కపిల్లను వాకింగ్ తీసుకెళ్లే కొత్త బిజినెస్ బాగుందంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి ఇండియాలో వస్తాయేమో చూడాలి.
ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి