LOADING...
Liver Health: లివర్ స‌మ‌స్య‌కు మద్యం ఒక్కటే కారణం కాదు.. నిపుణులు హెచ్చరిస్తున్న మరో ప్రమాదం ఇదే!
లివర్ స‌మ‌స్య‌కు మద్యం ఒక్కటే కారణం కాదు.. నిపుణులు హెచ్చరిస్తున్న మరో ప్రమాదం ఇదే!

Liver Health: లివర్ స‌మ‌స్య‌కు మద్యం ఒక్కటే కారణం కాదు.. నిపుణులు హెచ్చరిస్తున్న మరో ప్రమాదం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా ఎవరికైనా లివర్‌ (కాలేయం) సమస్యలు వచ్చాయంటే, చాలామంది వెంటనే అతను ఎక్కువగా మద్యం తాగుతాడేమో అని అనుకుంటారు. కానీ తాజా పరిశోధనలు ఒక భయానకమైన నిజాన్ని బయటపెడుతున్నాయి. లివర్ దెబ్బతినడానికి మద్యం మాత్రమే కాదు, మనం రోజూ వంటల్లో ఉపయోగించే కొన్ని నూనెలు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్లు దీనిపై స్పందిస్తూ, ఇంట్లో సాధారణంగా వాడే 'సీడ్ ఆయిల్స్' (విత్తనాల నుంచి తీసే నూనెలు) మద్యం కంటే కూడా ప్రమాదకరమని చెబుతున్నారు. అసలు ఈ సీడ్ ఆయిల్స్ ఏమిటి? అవి ఎందుకు డేంజర్‌గా మారుతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

Details

లివర్‌లో వాపు రావడం వంటి సమస్యలు

మన రోజువారీ వంటల్లో విస్తృతంగా ఉపయోగించే సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, మొక్కజొన్న నూనె (కార్న్ ఆయిల్), కనోలా ఆయిల్ వంటి వాటన్నీ సీడ్ ఆయిల్స్ కేటగిరీలోకి వస్తాయి. వీటిని ఫ్యాక్టరీల్లో తయారు చేసే సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలకు గురిచేస్తారు. అంతేకాదు, నూనెను విత్తనాల నుంచి తీసేందుకు పెట్రోల్ వంటి ఇంధనాల్లో వాడే 'హెక్సేన్' అనే రసాయనాన్ని కూడా ఉపయోగిస్తారనే విమర్శలు ఉన్నాయి. బయట మనం తినేచిప్స్, ప్యాకెట్ స్నాక్స్, హోటళ్లలో లభించే భోజనాల్లో ఎక్కువగా ఇవేనూనెలు వాడతారు. ఈసీడ్ ఆయిల్స్ శరీరంలోకి వెళ్లిన తర్వాత కొవ్వు కణాల్లో, లివర్‌లో ఏళ్ల తరబడి పేరుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితంగా లివర్‌లో వాపు రావడం, చివరికి 'ఫ్యాటీ లివర్' సమస్య ఏర్పడటం జరుగుతుంది.

Details

అయితే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి?

లివర్‌ను రక్షించుకోవాలంటే ప్రాసెస్ చేసిన నూనెలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వంటల్లో వెన్న, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను ఉపయోగించడం మేలని నిపుణుల అభిప్రాయం. అలాగే బయట దొరికే జంక్ ఫుడ్, మయోనైస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిది. ఒకవేళ ఇప్పటికే ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే, స్వయంగా మందులు వాడకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స, ఆహార సలహాలు తీసుకోవడం చాలా అవసరం. రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే, ఈ 'నిశ్శబ్ద విషం' నుంచి మన లివర్‌ను కాపాడుకోవచ్చు.

Advertisement