Page Loader
Iron Deficiency Symptoms: అలెర్ట్.. మీకు ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉన్నట్టే!
అలెర్ట్.. మీకు ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉన్నట్టే!

Iron Deficiency Symptoms: అలెర్ట్.. మీకు ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉన్నట్టే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2023
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

మానవ శరీరంలో ముఖ్యమైన ఖనిజం ఐరన్ అని చెప్పొచ్చు. ఇది రోగ నిరోధక వ్యవస్థకు, మెదడు పనితీరుకు, మానసిక పరిస్థితికి, కండరాలు బలంగా ఉండటానికి ఐరన్ దోహదపడుతుంది. ఒకవేళ ఐరన్ లోపం ఉంటే శరీరంలో వ్యాధులు ప్రబిలే ప్రమాదముంది. పిల్లల్లో మెదడు ఆరోగ్యంగా ఎదగడానికి ఇనుము కూడా చాలా అవసరం. ప్రస్తుతం కాలంలో ఆహారపు అలవాట్లు వల్ల ఇనుము లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ముందుగా మన శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇనుము లోపం ఉన్నట్లు భావించాలి. హీమోగ్లోబిన్ ఉత్పత్తికి కూడా ఐరన్ చాలా అవసరం. ఐరన్ లోపిస్తే పోషకాలు, ఆక్సిజన్ శరీర అవయవాలకు రవాణా అవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

Details

ఆహార పదార్థాల ద్వారానే శరీరానికి ఐరన్

కేవలం ఆహార పదార్థాల ద్వారానే శరీరానికి ఐరన్ అందుతుంది. ఐరన్ లోపం వల్ల చిన్న చిన్న పనులకు అలసట రావటం, విపరీతంగా నీరసంగా ఉండడం, బలహీనంగా ఉన్నట్టు అనిపించడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాలు వస్తాయి. ఇక ఐరన్ లోపంతో ఏ విషయంపైన కూడా ఏకాగ్రత ఉంచలేరు. త్వరగా అంటు వ్యాధులు ప్రబులుతాయి. ముఖ్యంగా లైంగిక ఆసక్తి తగ్గిపోవడం కూడా ఐరన్ లోపం వల్లే జరుగుతుంది. తృణ ధాన్యాలు, చిక్కుళ్లు, ఆకుకూరలు, నట్స్ వంటి మొక్కలు నుంచి వచ్చే ఆహారంలో ఇనుము ఆధికంగా ఉంటుంది. అలాగే చికెన్, గుడ్లు, చేపలు వంటి వాటిలో కూడా ఇనుము లభిస్తుంది.