LOADING...
Rakhi Special: ప్రకృతి రాఖీలు: కౌరవ-పాండవుల పుష్పాల ప్రత్యేకత తెలుసా?
ప్రకృతి రాఖీలు: కౌరవ-పాండవుల పుష్పాల ప్రత్యేకత తెలుసా?

Rakhi Special: ప్రకృతి రాఖీలు: కౌరవ-పాండవుల పుష్పాల ప్రత్యేకత తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అన్నా-చెల్లెళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ సందర్భంగా,సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి రక్షణ కోరే సంప్రదాయం ఉంది. ఈ సందర్భంలో మార్కెట్‌ లో లభించే రంగురంగుల రాఖీలే కాకుండా, ప్రకృతిలో ఏర్పడే ఒక ప్రత్యేకమైన పుష్పం గురించి చాలామందికి తెలియదు. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కనిపించే ఈ పుష్పాలు,తమ ఆకారంలో రాఖీలను పోలి ఉండటం వల్ల 'రాఖీ పూలు' అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. విశేషంగా, రాఖీ పండుగ సమయానికే ఈ పుష్పాలు వికసిస్తాయి. అయితే చూడగానే అట్రాక్ట్ చేసే ఈ పూల వెనక పెద్ద కథే ఉంది.

వివరాలు 

పుష్పం పైభాగంలో కనిపించే మూడు ప్రత్యేక రేఖలు.. ఎవరంటే.. 

ఈ పూలను 'కౌరవ-పాండవుల పూలు' అని కూడా పిలుస్తారు. కారణం ఏమిటంటే, ఈ పుష్పాల కింద భాగంలో సన్నని కేసరాల వంద రేఖలు ఉంటాయి. ఇవే 'కౌరవులు'గా గుర్తించబడతాయి. అలాగే మధ్యలో కనిపించే ఐదు పెద్ద రేఖలు 'పాండవులు'గా పేర్కొంటారు. దీనితో పాటు, పుష్పం పైభాగంలో కనిపించే మూడు ప్రత్యేక రేఖలను భీష్ముడు, ద్రోణుడు, కుంభాచార్యుడు అని భావిస్తారు. ఈ రాఖీ పూలు, శాస్త్రీయంగా పాసీఫ్లోరా జాతికి చెందినవిగా గుర్తించబడ్డాయి. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పుష్పాలు, సాయంత్రం వేళల్లో సువాసనలు వెదజల్లుతూ మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి.

వివరాలు 

సంప్రదాయ రాఖీల స్థానంలో ప్రకృతి రాఖీలు 

ఈ జాతిలో వందల రకాల పూలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. ముఖ్యంగా, నిద్రను ప్రేరేపించేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పుష్పాల నుండి తయారయ్యే ఔషధాలు ఉపయుక్తంగా నిలుస్తున్నాయి. ఈ పూలు విభిన్న పరిమాళాల్లో, భిన్న ఆకృతుల్లో, వైవిధ్యమైన రంగుల్లో విరబూస్తాయి. ఇటీవల కొన్ని చోట్ల సోదరీమణులు సంప్రదాయ రాఖీల స్థానంలో ఈ ప్రకృతి రాఖీలను తమ అన్నల చేతికి కడుతూ, ఆ ఆనందాన్ని రెట్టింపుగా అనుభవిస్తున్నారు.