AMLA JUICE : శీతాకాలంలో ఉసిరి రసం భేష్.. ఇన్ఫెక్షన్లపై రాజీలేని పోరాటం
ఉసిరికాయ అంటే భూతలస్వర్గం. భూమ్మీద ఉన్న అమృత ఫలాల్లో ఇదొకటి. ఇక కార్తీక మాసం వచ్చిందంటే చాలు పలిహోర, నైవేద్యం, పచ్చళ్లు ఇలా రకరకాల వంటివాటికి ఉసిరి తప్పనిసరి. మరోవైపు ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరిది ప్రధాన పాత్రే. అయితే శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తికి పచ్చి ఉసిరి శ్రేష్టం. ఉసిరి ఆహారంతో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందుకోవచ్చు. విటమిన్ సి ఉసిరిలో పుష్కలం. ఈ క్రమంలోనే దీన్ని తినేందుకు అందరికీ ఆసక్తి ఎక్కువ. ఉసిరి రసాన్ని పలుచగా జ్యూస్ మాదిరి తయారు చేసుకుని శీతాకాలంలో తాగితే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఎలాంటి రోగం నుంచి శరీరాన్ని కాపాడాలన్న కావాల్సిన రోగనిరోధక శక్తిని ఉసిరి అందిస్తుంది. ఉసిరిలో ఎన్నో పోషకాలున్నాయి.
విటమిన్ B5, విటమిన్ B6, రాగి, మాంగనీస్ , పొటాషియం పోషకాలు పుష్కలం
దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉసిరితో అందుకోవచ్చు. రోగనిరోధక శక్తి మొదలు జీవక్రియ పనీతీరుకు, కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుదలకు దీర్ఘకాలిక వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఉసిరిదే కీలక పాత్ర. జలుబు లాంటి ఫ్లూ, అంటువ్యాధులపై పోరాడేందుకు ఉసిరిని అస్త్రంగా వాడుకోవచ్చు. శీతాకాలంలో ఉసిరితో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. విటమిన్ B5, విటమిన్ B6, రాగి, మాంగనీస్ , పొటాషియం పోషకాలు పుష్కలంగా పొందొచ్చు. పచ్చి ఉసిరితో అధిక మొత్తంలో విటమిన్ సిని శరీరానికి అందించొచ్చు. ఉసిరి రసాన్ని జ్యూస్ రూపంలో తాగితే ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.ఇదే సమయంలో సాంప్రదాయ భారతీయ వైద్యం ఆయుర్వేదంలోనూ ఉసిరిని విరివిగా దీర్ఘకాలిక రోగాలకు సిఫార్స్ చేస్తుంటారు. NOTE : వాడే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.