Page Loader
ఉదయం పూట మీ మూడ్ బాగోలేదా..? యాక్టివ్ గా ఉండాలంటే ఈ చిట్కాలు అవసరం
మార్నింగ్ మూడ్

ఉదయం పూట మీ మూడ్ బాగోలేదా..? యాక్టివ్ గా ఉండాలంటే ఈ చిట్కాలు అవసరం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2023
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉదయం మూడ్ బాగాలేకపోతే ఆ రోజంతా ఏ పనిని ఉత్సాహంగా చేయలేరు. ఎవరైనా ఆ సమయంలో మీతో జోక్స్ పంచుకున్న చాలా చిరగ్గా అనిపిస్తుంది. ఒకరకమైన పని లేదా పని చేసే చోట సరైన వాతావరణం లేకపోవడం వల్ల విసుగు పుట్టడం లేదా కొన్ని కారణాల వల్ల మీ మూడ్ చెడగొట్టవచ్చు. ముఖ్యంగా ఉదయం మూడ్ బాగలేకపోతే ఆ రోజంతా ప్రశాంతత ఉండదు. ఏ పనిని సక్రమంగా చేయలేరు. ఉదయం పూట మన మైండ్ సెట్ ను సానుకూలంగా మార్చుకోవాలంటే ఈ చిట్కాలను పాటించాల్సిందే. ఇవి ప్రతికూల ఆలోచనలను దూరం చేసి ప్రశాంతతను అందిస్తాయి. ఉదయం మన శరీరానికి సూర్యరశ్మి తగిలినప్పుడు హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది డిప్రెషన్ ను నివారించడంతో సహాయపడుతుంది.

Details

ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తే మూడ్ ఛేంజ్

ఎండ తక్కువగా ఉన్నప్పుడు 10-15 నిమిషాలు ఎండలో ఉండాలి. అంతకంటే ముందు చర్మానికి సన్ స్క్రీన్ రాసుకోవాలి. తేలికపాటి శారీరక శ్రమ కూడా మంచి ఉత్సహాన్ని ఇస్తుంది. మార్నింగ్ వాక్ చేయడం చాలా మంచిది. నడవడమే కాకుండా, సైక్లింగ్ చేయవచ్చు. ఏవైనా గేమ్స్ ఆడడం కూడా మంచింది. ఏది కుదరకపోతే ఉన్నచోటనే కొన్ని స్ట్రెచింగ్ చేయవచ్చు. ప్రకృతిలో మన మనస్సుని ఎంతో తేలికపరస్తుంది. వెళ్లే దారిలో ఆకుపచ్చని చెట్లు, పూలు, పూల సువాసనలు ఆస్వాదించండి. పక్షుల కదలికలు చూడండి. కాసేపు ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తే మీ మూడు ఛేంజ్ అవకాశం ఉంటుంది.