
Firecrackers: దీపావళికి ముందు.. ఇంట్లో 5 కిలోలకు మించి టపాసులు నిల్వ చేస్తున్నారా?
ఈ వార్తాకథనం ఏంటి
దీపావళి పండుగ కోసం ముందస్తుగా నగరంలో వేల సంఖ్యలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు, వ్యాపారులు సిద్ధమవుతున్నారు. గతేడాది 1,400కి పైగా తాత్కాలిక, శాశ్వత దుకాణాల కోసం దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరగే అవకాశం ఉంది.
Details
నిబంధనలు, అనుమతులు
ఇంట్లో ఐదు కిలోలకు మించి బాణసంచా నిల్వ చేస్తే, పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరి. తప్పనిసరి జాగ్రత్తలు 1. అగ్నిమాపక పరికరాలు బాణసంచా నిల్వ చేసే ప్రదేశం (షాపు, గోదాం) దగ్గర 5 కిలోల సామర్థ్యం కలిగిన రెండు అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలి. 2. నీటి ట్యాంకులు ఇంటి పైకప్పుపై 1,000 లీటర్ల వాటర్ ట్యాంక్, దిగువ భాగంలో 450 లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంక్ ఉండాలి. అదనంగా 200,000 లీటర్ల అండర్‌గ్రౌండ్ స్టాటిక్ వాటర్ ట్యాంక్ ఉండాలి.
Details
3. విద్యుత్ అనుమతి
విద్యుత్తు సరఫరా సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ ద్వారా పరిశీలించి, అంతరాయం లేకుండా ప్రమాదరహితంగా మార్చాలి. 4. గోదాం నిర్మాణం గోదాం గదులు ఇటుకలు, కాంక్రీట్, జీఐ షీట్స్ వంటి అంటుకునే స్వభావం లేని వస్తువులతో మాత్రమే నిర్మించాలి. 5. సురక్షితంగా నిల్వ చేయాల్సిన వస్తువులు గదుల దగ్గర కలప, దుస్తులు, ప్లాస్టిక్ వంటి మండే స్వభావం ఉన్న వస్తువులను ఉంచకూడదు.