
Indrakeeladri: ఇవాళ దుర్గాష్టమి.. నేడు దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దర్శనం
ఈ వార్తాకథనం ఏంటి
ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు 'దుర్గాష్టమి' జరగనుంది. ఈ ప్రత్యేక రోజున భక్తులు 64 యోగినులు, దుర్గాదేవి యొక్క రూపాలైన 'అష్ట నాయికలను' పూజిస్తారు. దుర్గాష్టమి సందర్భంగా కనక దుర్గాదేవి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి అలంకరణను చూడటానికి ఆలయ బార్లను తీరారు. నవరాత్రి సందర్భంగా, అమ్మవారు ప్రతిరోజూ ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. దుర్గాష్టమి రోజున కనక దుర్గాదేవి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మగా దర్శనమిస్తూ భక్తులను అలరిస్తున్నారు.
Details
దుర్గాదేవి ఆరాధనతో దుష్టశక్తులు దూరమవుతాయి
మహాకాళీ నుదుటి నుంచి ఉద్భవించినదే ఈ దుర్గాదేవి కాబట్టి, కనకదుర్గమ్మను కాళీ, చండీ, రక్తబీజ రూపాలలో పూజిస్తారు. దుర్గాదేవి ఆరాధనతో దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రాక్షస బాధలు భక్తులకు దూరమవుతాయని నమ్మకం ఉంది. దుర్గ అనే పేరు గత జన్మలలోని దుర్గుణాలను చెరిపి, సద్గుణాలుగా మారుస్తుందని నిర్మలమైన మనస్సుతో పూజించే భక్తులకు సంతోషాన్ని ఇస్తుందనే విశ్వాసం ఉంది. శరన్నవరాత్రులలో దుర్గాసప్తశతి, దుర్గాసప్తశ్లోకీ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ముఖ్యంగా నవరత్రిలో చివరి మూడు రోజులలో దుర్గాసప్తశతి పారాయణం చేస్తే మరింత శుభ ఫలితాలు లభిస్తాయని నమ్మకం ఉంది.