మీ కిడ్నీల ఆరోగ్యానికి ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి
గత కొన్నాళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బాధితులు వేగంగా పెరుగుతున్నారు. ప్రారంభ దశల్లోనే దీన్ని గుర్తించి అడ్డుకట్ట వేయాలి.లేకపోతే వ్యాధి తీవ్రంగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని ఆయుర్వేదం చిట్కాలు ఉన్నాయి. మీకు మధుమేహం గనక ఉంటే,రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. మీ రక్తపోటును 140/90 లేదా అంతకంటే తక్కువగా ఉంచుకోవాలి. మధుమేహం లేని 60 ఏళ్లు పైబడిన రోగులు వారి రక్తపోటును 150/90 కంటే తక్కువగా ఉంచేందుకు కృషి చేయాలి.
తిప్పతీగ ఆకు రసం కిడ్నీలను కాపాడుతుంది
1. అఫ్లాటాక్సిన్ ఫ్రీ రాడికల్స్‌తో కిడ్నీ విషపూరితం కాకుండా తిప్పతీగ ఆకు రసం కిడ్నీలను కాపాడుతుంది. ఇందులో ఆల్కలాయిడ్స్ ఉండటమే దీనికి కారణం. 2. కిడ్నీ రోగుల్లో సీరం, యూరియా, క్రియేటినిన్ స్థాయిలను పసుపు తగ్గిస్తుంది. మెరుగైన ప్లాస్మా ప్రోటీన్ల ఉత్పత్తికి సహకరిస్తుంది. 3. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, మూత్రపిండాల్లోని వాపు, నొప్పిని తగ్గిస్తాయి. 4. త్రిఫల చూర్ణం మూత్రపిండాల కణజాలాన్ని బలపరుస్తుంది. ప్లాస్మా ప్రోటీన్లు అల్బుమిన్, క్రియేటినిన్ ను నియంత్రించి కిడ్నీల పనితీరును భేషుగ్గా ఉంచుతుంది. 5. అరటి చెట్టు మధ్యలో ఉండే దూటతో చేసిన రసం మూత్రపిండాలను క్లీన్ చేసి మూత్ర వ్యవస్థను బలంగా మారుస్తుంది. అనాస పండు, నేరేడు , బొప్పాయి పండ్లు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.