PMJAY: ఆయుష్మాన్ భారత్ పథకం.. రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం 70 ఏళ్లు, ఆపై వయసు గల వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ పథకం ఆర్థిక స్థోమత లేకుండా, ఆధార్ కార్డు ఆధారంగా అందరికి వైద్యమందిస్తోంది. ఇందులో చేరిన వారికి రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సలను ఉచితంగా పొందవచ్చు. ఆయుష్మాన్ వయ్ వందన కార్డ్ 70 ఏండ్లు పైబడి వయసు గల వారు ఈ పథకంలో చేరి ఆయుష్మాన్ వయ్ వందన కార్డు పొందచ్చు. ఈ కార్డు వృద్ధుల ఆరోగ్య సేవల కోసం ప్రత్యేకంగా అందజేస్తారు.
అధార్ కార్డు అవసరం
ఈ పథకంలో చేరడానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. చికిత్స పొందడానికి సమయం పథకంలో చేరిన వెంటనే వృద్ధులు వైద్య చికిత్స పొందడానికి అర్హులైపోతారు. ఈ బీమా కవరేజ్ ప్రారంభం నుంచే అమలవుతుంది. బదిలీ అవకాశం లేదు ఈ పథకంలో చేరిన వారు, ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకానికి మారలేరు. పీఎంజేఏవై పథకంలోనే కొనసాగాల్సిందే దరఖాస్తు విధానం ఈ పథకంలో చేరడానికి, www.beneficiary.nha.gov.in పోర్టల్ ద్వారా లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల కోసం దరఖాస్తు ఒకే కుటుంబంలో చాలా మంది అర్హులు ఉంటే, మొదటి వ్యక్తి వివరాలు నమోదు చేసి, 'యాడ్ మెంబర్' క్లిక్ చేసి, ఇతరుల వివరాలను కూడా నమోదు చేయవచ్చు.