మేకప్ లేకుండా అందంగా కనిపించడానికి పాటించాల్సిన చిట్కాలు
మేకప్ తో పూర్తి లుక్ మారిపోతుంది. నిజమే, కానీ మేకప్ లోని రసాయనాలు చర్మాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి ఇబ్బంది మీ చర్మానికి రాకుండా ఉండాలంటే మేకప్ లేకుండా అందంగా కనిపించాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. మాస్క్ వేయండి: సహజ సిద్ధమైన పదార్థాలతో మాస్క్ తయారు చేసుకుని ముఖానికి అతికించండి. దీనివల్ల కొత్త మెరుపు వస్తుంది. బ్లాక్ హెడ్స్ తొలగిపోవడానికి ముక్కుపైన పోర్ స్ట్రిప్ వాడండి. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేస్తే, చర్మం శుభ్రంగా తయారవుతుంది. మాయిశ్చరైజ్: ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని టోనర్ ఉపయోగించి, ఆ తర్వాత మాయిశ్చరైజ్ చేయండి. రోజూ రెండుసార్లు ఇలా చేయడం వల్ల మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
మేకప్ లేకుండా అందం పెరగాలంటే చేయాల్సిన పనులు
ఐ క్రీమ్: కళ్ళకింద ఏర్పడ్డ నల్లటి వలయాలు తొలగిపోవడానికి ఐ క్రీమ్ ట్రై చేయండి. ఐ క్రీమ్ కారణంగా కళ్ళకింద చర్మం తేమగా ఉంటుంది. సన్ స్క్రీన్: ఎండలో బయటకు వెళ్లాలనుకుంటే లేదా కంప్యూటర్ ముందు కూర్చోవాలనుకున్నప్పుడు ముఖానికి, మెడ భాగానికి, చేతులకు సన్ స్క్రీన్ అప్లై చేయండి. కనురెప్పలను పట్టించుకోండి: ముఖంలో ముఖంగా కనిపించేవి కళ్ళే. కనురెప్పలు సరిగ్గా ఉంటే కళ్ళ అందం ఇంకా పెరుగుతుంది. అందుకే కనురెప్పలను అందంగా మార్చుకోండి. కనుబొమ్మలను దువ్వండి: కనుబొమ్మలు అడ్డదిడ్డంగా ఉంటే ముఖం అందంగా కనిపించదు. కాబట్టి కనుబొమ్మలను చిన్నపాటి బ్రష్ తో దువ్వండి. పై జాగ్రత్తలన్నీ పాటిస్తే మేకప్ వేసుకోకుండానే మీరు అందంగా కనిపిస్తారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి