
Heart Attack: చలికాలంలో హార్ట్ ఎటాక్ వచ్చే ముందు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం చేయద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో సాధారణంగా జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. మరి ముఖ్యంగా హార్ట్ అటాక్‌కు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చల్లని వాతావరణంలో రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తపోటు పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
దీనివల్ల ఏ ఇతర ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తులకు కూడా హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే అవకాశం ఉంది.
ఈ పరిస్థితిని 'అథెరోస్క్లెరోసిస్' అంటారు. రక్తనాళాలు బ్లాక్ అయి గుండెకు తగినంత రక్తం అందకపోవడం వల్ల హార్ట్ అటాక్ ఏర్పడే ప్రమాదముంది.
హర్ట్ ఎటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Details
1. ఛాతీ నొప్పి
ఛాతీ నొప్పి అనేది గుండెకు తగినంత ఆక్సిజన్ అందకపోవడాన్ని సూచించే ముఖ్యమైన సంకేతం.
ఇది ఛాతీపై ఒత్తిడి, గట్టిగా పట్టుకున్నట్లు లేదా బలంగా తొక్కినట్లుగా అనిపిస్తుంది. చాలా మంది రాత్రిపూట, ముఖ్యంగా పడుకున్నప్పుడు ఈ నొప్పిని అనుభవిస్తారు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
2. చెమటలు పట్టడం
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి రాత్రిపూట చెమటలు పడతాయి.
చల్లని వాతావరణంలో కూడా చెమటలు పట్టడం, గుండెపై భారం పడ్డట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడి సలహా తీసుకోవాలి.
3. వికారం లేదా అజీర్తి
చలికాలంలో చాలామంది వికారం లేదా అజీర్తి సమస్యలు ఎదుర్కొంటారు, అయితే ఈ లక్షణాలు గుండె సంబంధిత సమస్యల సంకేతంగా కూడా ఉండొచ్చు.
Details
4. నిద్రలో శరీరం నీరసంగా ఉండటం
అదృష్టవశాత్తు మీరు కంటి నిండా నిద్రపోయినా శరీరం బలహీనంగా, నీరసంగా అనిపిస్తే, అది గుండె సంబంధిత సమస్యకు సంకేతం కావచ్చు.
రక్తప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవచ్చు. నిద్ర పోయినా కూడా నీరసం తగ్గకపోతే, డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.
5. ఉపిరి ఆడకపోవడం
కొంతమంది వ్యక్తులకు నిద్రలో ఊపిరి ఆడకపోవచ్చు. వారు నిద్రలోంచి అకస్మాత్తుగా లేస్తుంటారు, తర్వాత బలంగా శ్వాస పీల్చాల్సి వస్తుంది.
ఇది గుండె సంబంధిత సమస్యలకు సంకేతం కావచ్చు. రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల గుండెకు సరిపడా రక్తం అందదు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని దగ్గర పరీక్షలు చేయించుకోవడం చాలా ఉత్తమం.