Jaggery benefits: భోజనం తర్వాత బెల్లం తింటే.. బోలెడన్ని ప్రయోనాలు
చాలా మంది ఆహారం తిన్న తర్వాత ఖచ్చితంగా బెల్లం తింటారు. బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బెల్లం శరీరాన్ని అనేక రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంచుతుంది. అందుకే ఆహారం తిన్న తర్వాత బెల్లం తినమని సలహా ఇవ్వడానికి కారణం ఇదే. భోజనం తర్వాత బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి పెరుగుదల మీ శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకోవాలనుకున్నా.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకున్నా భోజనం తర్వాత బెల్లం తినడండి. బరువు తగ్గుదల బరువు తగ్గాలనుకుంటే.. రోజూవారి ఆహారంలో బెల్లాన్ని భాగం చేసుకోండి. ఆహారం తిన్న తర్వాత బెల్లం తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. తద్వారా బరువు తగ్గొచ్చు.
జీర్ణవ్యవస్థ మెరుగు
జీర్ణవ్యవస్థను బలోపేతానికి బెల్లం చక్కగా ఉంపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజూ బెల్లం తినాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్, అజీర్ణం, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. రక్తపోటు నియంత్రణ మీరు రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నట్లయితే బెల్లం తినడం ప్రారంభించాలి. బెల్లం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఎముకలకు బలం బెల్లం తినడం వల్ల శరీరంలోని ఎముకలు బలపడతాయి. కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు బెల్లంలో ఉండటం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం ఉబ్బసం, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు బెల్లం సహాయపడుతుంది. అల్లం లేదా నువ్వులతో బెల్లం తింటే శ్వాసకోశ సమస్యలు నయమై ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుంది.