Weight Loss: వ్యాయామం తర్వాత కూడా బరువు తగ్గడం లేదా? ఈ 4 రక్త పరీక్షలు చేయించుకోండి
నేటి కాలంలో బరువు తగ్గడం అత్యంత కష్టమైన సవాలుగా మారింది. చెడు జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు ఊబకాయానికి గురవుతున్నారు. కానీ బరువు పెరగడం కూడా అనేక వ్యాధులకు కారణం కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఊబకాయం కారణంగా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కొంతమంది బరువు తగ్గడానికి చాలా వ్యాయామాలు, డైటింగ్ కూడా చేస్తారు. కానీ కొన్నిసార్లు మీరు ఇంత కష్టపడి కూడా బరువు తగ్గలేకపోతే, దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. బరువు తగ్గకపోవడానికి అనేక అంశాలు కారణమవుతాయని అంటున్నారు న్యూట్రిషనిస్ట్. మీరు బరువు తగ్గాలనుకుంటే, ముందుగా రక్త పరీక్ష చేయించుకోవాలి. మీ బరువు తగ్గించే క్రమంలో ఏ.. ఏ రక్త పరీక్షలు చేయించుకోవాలో తెలుసా..?
ఇంఫ్లిమేషన్ తనిఖీ
నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాపు కూడా బరువు తగ్గడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. శరీరంలో మంట సమస్యను గుర్తించడానికి సి-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) పరీక్ష సిఫార్సు చేయబడింది. శరీరంలో CRP పెరగడం తీవ్రమైన ఆరోగ్య పరిస్థితిని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో, ఖచ్చితంగా ఈ పరీక్ష చేయించుకోండి. విటమిన్ డిశరీరంలో విటమిన్ డి లోపం కూడా బరువు తగ్గడంలో ఇబ్బందిని కలిగిస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు బరువు తగ్గకపోతే ఖచ్చితంగా విటమిన్ డి పరీక్ష చేయించుకోండి.
థైరాయిడ్ కూడా కారణం
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా బరువు తగ్గడంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు తప్పనిసరిగా T3, T4,TSHకి సంబంధించిన పరీక్షలను చేయించుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు జీవక్రియలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ టెస్ట్ రక్తంలో చక్కెర నియంత్రణలో లేకపోయినా, బరువు తగ్గడం కష్టం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలియాలంటే హెచ్‌బీఏ1సీ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.