Page Loader
ఆక్సిటోసిన్: మీ భాగస్వామితో బంధం బాగుండాలంటే లవ్ హార్మోన్ ని ఈ విధంగా పెంచుకోండి 
ఆక్సిటోసిన్ ఉత్పత్తిని పెంచే కొన్ని పనులు

ఆక్సిటోసిన్: మీ భాగస్వామితో బంధం బాగుండాలంటే లవ్ హార్మోన్ ని ఈ విధంగా పెంచుకోండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 28, 2023
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆక్సిటోసిన్ హార్మోన్ ని లవ్ హార్మోన్ అని పిలుస్తారు. ఈ హార్మోన్ కారణంగా బంధాలు బలపడటంతో పాటు మానసిక ఆరోగ్యం కలుగుతుంది. ఈ హార్మోన్ మన శరీరం సహజంగానే ఉత్పత్తి చేస్తుంది. దీని స్థాయిలను కొన్ని పనుల ద్వారా పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఆ పనులేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ తో కలవడం: స్నేహితులతో కలిసి మాట్లాడటం వల్ల ఆక్సిటోసిన్ పెరుగుతుంది. రెగ్యులర్ గా పనిగురించి మాట్లాడే విషయాలు కాకుండా ఊరికే పిచ్చాపాటి కబుర్లు మాట్లాడటం వల్ల ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. భౌతిక స్పర్శ: ఒక చిన్న స్పర్శ మన మెదడులో ఆక్సిటోసిన్ ని ఉత్పత్తి చేస్తుంది. భుజం మీద చిన్నగా తట్టడం, ఒక చిన్న కౌగిలింత, మొదలగు వాటి కారణంగా మెదడులో ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది.

Details

బహుమతుల ద్వారా విడుదలయ్యే ఆక్సిటోసిన్ 

యోగా: యోగా కారణంగా యాంగ్జాయిటీ, ఒత్తిడి తగ్గిపోతాయి. అంతేకాదు ప్రాణాయామం, ధ్యానం కారణంగా ఒత్తిడి తగ్గిపోయి శరీరంలో ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇలాంటప్పుడు మనసంతా ప్రశాంతంగామారిపోతుంది. బహుమతులు: మీ స్నేహితుల నుండి గానీ, మీ భాగస్వాముల నుండి బహుమతులు అందుకున్నప్పుడు అమాంతం ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది. అంతులేని ఆనందం కళ్ళముందు కనిపించినపుడు ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది. పాటలు పాడటం: మీ గొంతు బాగాలేకపోయినా మీకు నచ్చిన వారు పక్కన ఉన్నప్పుడు వారితో కలిసి పాట పాడితే ఆక్సిటోసిన్ విడుదలై మీ మనసుకు హాయి కలిగిస్తుంది. మీకు నచ్చిన వారితో డ్యాన్స్ చేయడం కూడా ఆక్సిటోసిన్ ఉత్పత్తి కావడానికి సాయపడుతుంది. మీకు తోడు ఎవరూ లేకపోతే ఒంటరిగా డ్యాన్స్ చేయండి.