BreakFast for kids: స్కూల్ పిల్లల బ్రేక్‌ఫాస్ట్ మెను ఎలా ఉండాలి.. ఏం పెట్టాలంటే
స్కూల్ పిల్లలకు అల్పాహారం విషయంలో తల్లిదండ్రులు తర్జనభర్జన పడుతుంటారు. ముఖ్యంగా తల్లి పాత్ర ఈ విషయంలో కీలకంగా ఉంటుంది. తమ పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ఏం పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఎలా సిద్ధం చేయాలని ప్రతిరోజూ ఒక సవాల్ ఎదురవుతుంది. అయితే పిల్లల ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని, ఇందుకోసం ఎప్పుడూ చేసే సింపుల్ వంటకాల్లోనే కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని హెల్తీ లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. సాధారణంగా పిల్లలు ఉదయాన్నే బడికి తయారవుతుంటారు. ఆ హడావిడిలో సమయం సరిగ్గా చాలక ఉదయాన్నే సరిగ్గా తినకుండానే పాఠశాలకు బయలుదేరుతుంటారు. ఇక ఉదయాన్నే శరీరానికి మంచి పోషకాహారాలు అందించాల్సి ఉంటుంది.
మిల్‌మేకర్, పనీర్, క్యాబేజ్, క్యారెట్, బీట్ రూట్, బీన్స్ లాంటి
పిల్లలకు ఉదయాన్నే ఏ చిన్న బ్రెడ్డు ముక్కో, టోస్టో పెట్టి పంపిస్తే ఇబ్బంది పడతారు. రోజంతా హుషారుగా,ఆరోగ్యంగా,బలంగా,ధృఢంగా ఉండాలంటే ఉదయాన్నే టిఫిన్‌లో ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్ పదార్థాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ తప్పనిసరిగా అందేలా ఉండాలి. ప్రొటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఉడికించిన గుడ్ల లాగే ఆమ్లెట్ కూడా పోషకాహారమే. కాసిన్ని కూరగాయల ముక్కలు,కొత్తిమీర,అల్లం ముక్కలు,దనియాలు వాడాలి. నూనెకు బదులుగా నెయ్యిని వాడొచ్చు. ఇక రెండు వైపులా చక్కగా కాలిన తర్వాతపైన కాస్త చీజ్ తురుము వేయండి.ఫలితంగా పోషకాహారాలు అందుతాయని ఆహార నిపుణులు వివరిస్తున్నారు. మిల్‌మేకర్, పనీర్, క్యాబేజ్, క్యారెట్, బీట్ రూట్, బీన్స్ లాంటి వాటిని తరిగి టిఫిన్స్ తయారు చేయండి.కొత్తిమీర లాంటి ఆకు కూర ఉండేలా చూసుకోండి.